Nani - Dasara: దయచేసి అలా వేరు చేయొద్దు!
ABN , First Publish Date - 2023-03-07T21:01:51+05:30 IST
సినిమాల విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే మాట వద్దు. ప్రాంతాల పేరుతో కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కటే అనే భావన కలిగే అంతా కలిసుందాం’’ అని నేచురల్ స్టార్ నాని అన్నారు.
"సినిమాల విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే మాట వద్దు. ప్రాంతాల పేరుతో కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కటే అనే భావన కలిగే అంతా కలిసుందాం’’ అని నేచురల్ స్టార్ నాని (nani)అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం. ‘దసరా’(Dasara). నాని నటించిన తొలి ప్యాన్ ఇండియా )pan india movie) చిత్రమిది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబై వెళ్లిన ఆయన జుహులోని సినీ ప్రియులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి యువతతో రంగులు పూయించుకున్నారు. దసరా చిత్రంలోని డైలాగ్‌లను హిందీలో చెప్పి అలరించారు. (nani Celebrating Holi at Mumbai)
నాని మాట్లాడుతూ ‘‘కళ అనేది ఎక్కడైనా ఒకటే. సినిమాల విషయంలో ప్రాంతీయ బేధాలు అవసరం లేదు. సినిమాలను ప్రాంతాల తేడాతో వేరు చేయవద్దు. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పఠాన్’ వంటి చిత్రాలతో ఇప్పుడంతా భారతీయ సినిమాగా మారిపోయింది. ఇక్కడ రూపొందిన ‘పఠాన్’ మాది.. అక్కడ తెరకెక్కిన ‘దసరా’ మీది అంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ నెల 30న ‘దసరా’ చిత్రం విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారం ముమ్మరం చేసింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పాట విడుదల చేస్తూ, సినిమానూ అంచనాలు రేకత్తిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. నూతన దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కించారు. కీర్తి సురేశ్ (Keerthi suresh) కథానాయిక. ఇందులో నాని ధరణి అనే పాత్రలో పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తారు.