Dasara: నాని సినిమా షాకింగ్ బిజినెస్

ABN , First Publish Date - 2023-03-29T13:27:12+05:30 IST

నాని ఇప్పుడు స్టార్ గా ఎదుగుతున్నాడు. అతని సినిమా 'దసరా' రేపు శ్రీరామనవమి కి విడుదల అవుతోంది. అయితే ఆ సినిమా విడుదలకి ముందు చేసే బిజినెస్ చూస్తే షాకింగ్ గా నాని సినిమా కెరీర్ ఇదే హైయెస్ట్....

Dasara: నాని సినిమా షాకింగ్ బిజినెస్

నాని (Nani) కెరీర్ లో అత్యంత కీలకమైన సినిమా 'దసరా' (Dasara). ఈ సినిమా రేపు అంటే శ్రీరామ నవమి సందర్బంగా మార్చి 30 న విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ఎందుకు కీలకం అంటే, ఇది చాలా భారీగా విడుదల అవుతోంది, అలాగే భారీ బడ్జెట్ కూడా పెట్టారు, భారీ బిజనెస్ కూడా చేసింది. ఈ సినిమాకి ఎన్నడూ చెయ్యనంత ప్రచారం నాని చేసాడు. దేశం లో వున్న ప్రధాన నగరాలూ అన్నీ తిరిగేసాడు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా చాల భాషల్లో ఈ సినిమా విడుదల అవుతూ ఉండటం తో నాని ప్రచారం కూడా ఒక్కడే తన బుజాల మీద వేసుకొని చేసాడు. అందుకే ఇది నాని కి కీలకమైన సినిమా. దీనికి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇందులో కథానాయికగా చేసింది.

ఇక ఈ సినిమా విడుదలకి ముందు ఎంత బిజినెస్ చేసింది అంటే, అది నాని కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. సుమారు రూ. 50 కోట్ల వరకు విడుదలకి ముందు ఈ సినిమా ని అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. నైజామ్ (Nizam area) ఒక్క ఏరియాలోని ఈ సినిమా సుమారు రూ.13 కోట్లకు అమ్ముడయింది అంటే నాని తన మార్కెట్ ని ఎంతగా విస్తరించుకున్నాడో అర్థం అవుతోంది. ఇది నాని కెరీర్ లో నైజాం ఏరియా లో బెస్ట్ అని చూపొచ్చు. అలాగే ఆంధ్ర ఏరియా మొత్తం రూ.15 కోట్ల వరకు అమ్ముడుపోయింది. అలాగే సీడెడ్ కూడా రూ.6.5 కోట్ల వరకు వెళ్ళింది. కర్ణాటక రూ. 2 కోట్లు, నార్త్ ఇండియా మొత్తం రూ. 4 కోట్లు, తమిళనాడు, కేరళ కలిపి సుమారు రూ.1.5 కోట్ల వరకు బిజనెస్ చేసింది.

Dasara-Film.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా నాని సినిమా బాగానే అమ్ముడుపోయింది. ఓవర్సీస్ మార్కెట్ (Overseas Market) సుమారు రూ.6 కోట్ల వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆసక్తికరం ఏంటి అంటే, ఈ సినిమా విడుదల అయ్యాక కలక్షన్స్ సూపర్ గా ఉండాలి. అలాగే విడుదల అయ్యాకా ఈ సినిమా రూ. 50 కోట్లు దాటి రెవిన్యూ రాబట్టాలి, అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత లాభాల్లో వుంటారు. మరి అంత రాబడుతుందా? అన్నది సినిమా విడుదల అయ్యాక చూడాలి. నాని అయితే చాల కాన్ఫిడెంట్ గా వున్నాడు, అందుకే కదా మరి అంతలా ప్రచారం చేసాడు.

అయితే శ్రీరామనవమి పండగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు దినం కావటం తో, ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. అయితే ఆ తరువాత ఈ సినిమా ఎలా వుంది అన్న మాట మీద మిగతా రోజుల్లో రెవిన్యూ ఉంటుంది.

Updated Date - 2023-03-29T13:27:13+05:30 IST