Nani: అమ్మాయి మనది కాదని తెలిసినప్పుడు వినే పాట ఇది
ABN , First Publish Date - 2023-02-13T20:48:01+05:30 IST
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా
‘ఓరి వారి’ (Ori Vaari) నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్.. విజువల్‌గా స్టన్నింగా వుంటుందని అన్నారు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani). ఆయన హీరోగా.. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీకి తెరకెక్కుతోన్న చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నానికి జోడిగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది సినిమాపై భారీగా అంచనాలు పెంచుతుండగా.. తాజాగా చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘ఓరి వారి’ పాటని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట వింటుంటే.. ఇదొక హార్ట్‌బ్రేక్ సాంగ్ అనిపిస్తోంది. సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ఈ పాటని హార్ట్ టచ్చింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. మళ్ళీమళ్ళీ వినాలనిపించే పాట ఇది. శ్రీమణి (Shreemani) అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి పదం మనసుని తాకుతుంది. ఓరి వారి పాట వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ పాట విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. (Ori Vaari Lyrical Video)
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘దసరా’ లో నాకు చాలా ఇష్టమైన పాట ‘ఓరి వారి’. నా పర్సనల్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా వున్న పాట ఇది. ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి.. ఆ తర్వాత ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్. శ్రీమణి చాలా అద్భుతంగా రాశారు. సంతోష్ నారాయణన్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. విజువల్‌గా ఈ పాట నా కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పగలను. మార్చి 30న స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అందరూ స్టన్ అయిపోతారు. వినే కొద్ది నచ్చే పాట ఇది. నెలలు తరబడి నా చెవిలో మ్రోగుతూనే వుంది. అదే ఎఫెక్ట్ రేపు ఆడియన్స్ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. దసరాకి చాలా సెలబ్రేషన్స్ వుంటాయి. ‘దసరా’ అందరం సెలబ్రేట్ చేసుకునే సినిమా.. అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘ఓరి వారి’ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. (Nani about Ori Vaari song)