Nani: రికార్డు సృష్టించిన దసరా
ABN , First Publish Date - 2023-01-31T13:55:00+05:30 IST
ఈ దసరాసినిమా ఒక రికార్డు కూడా సృష్టించిందని చెపుతున్నారు. (Dasara Record) అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒక సెట్ లో జరిగింది అని అంటున్నారు. దీని వెనకాల ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల (Art director Avinash Kolla) శ్రమ చాలా వుంది అని తెలిసింది.
నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా టీజర్ విడుదల అయింది. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల అవుతోంది, అదీ కాకుండా నాని ఈ సినిమా మీద చాల నమ్మకంగా వున్నాడు. అందుకే 'ఆర్.ఆర్.ఆర్' (RRR), 'కె.జి.ఎఫ్' (KGF) తరువాత 'దసరా' చెప్పుకుంటారు అని అన్నాడు. మార్చి 30వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాకి ప్రచారాలు కూడా బాగా చెయ్యాలి అనుకొని అప్పుడే మొదలెట్టేసాడు కూడా. అయితే ఈ సినిమా ఒక రికార్డు కూడా సృష్టించిందని చెపుతున్నారు. (Dasara Record) అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒక సెట్ లో జరిగింది అని అంటున్నారు. దీని వెనకాల ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల (Art director Avinash Kolla) శ్రమ చాలా వుంది అని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ కోసం ఒక వూరు సెట్ వేశారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఈ సెట్ లో జరిగింది అంటే, అది రికార్డు కాకుండా ఎలా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం లో గోదావరిఖని (Godavarikhani) దగ్గర వుండే ఒక ఊరుని అవినాష్ ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రాంతంలో తయారు చేసాడు. ఈ సెట్ కోసం సుమారు మూడు నాలుగు నెలలు కష్టపడ్డాడు అని తెలిసింది. ఈ వూరు సెట్ కోసం కొన్ని వందలమంది శ్రామికులను వుపయోగించి ఎక్కడా కూడా సెట్ అని కాకుండా నిజంగా ఇక్కడ ఒక వూరు వుంది అన్నట్టుగా చేసాడు అవినాష్. ఈ సెట్ లో నిజంగానే 175 ఇళ్ళు వరకు కూడా కట్టాడు అవినాష్. వూర్లో రోడ్లు, చెట్లు, ఊరి జనాలు కూర్చునే రచ్చబండ ఒకటేమిటి అన్నీ అలాగే దించేసాడు అవినాష్ అని తెలిసింది. ఈ 'దసరా' సినిమా మొత్తం ఈ సెట్ లోనే చేశారు. ఇంచుమించు 100 రోజులకి పైగా ఈ సెట్ లో షూటింగ్ చేశారు అని తెలిసింది.
బొగ్గుకి సంబంధించి నేపధ్యం కాబట్టి, ఈ వూర్లో ఎక్కువగా గ్రీనరీ కనపడదు. ఒక పది అడుగుల మర్రిచెట్టు, అలాగే కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు, కరెంటు పోల్స్, ఇంకా అనేక ఇతర పనిముట్లు చాలా భారీగా కొనుగోలు చేసినట్టుగా కనపడుతోంది. ఈ వూరు సెట్ మొత్తం వెయ్యడానికి సుమారు 14 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ సినిమాకి అది అంత అవసరమని కూడా తెలిసింది. సినిమా మొత్తం ఇక్కడే షూటింగ్ చేసారు అంటే ఈ ఊరి సెట్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది కదా. అలాగే ఈసారి అవినాష్ కి కచ్చితంగా అవార్డులు కూడా వస్తాయని, ఈ సినిమాతో అవినాష్ పేరు జాతీయంగా మారుమోగుతుందని కూడా అంటున్నారు. అవినాష్ ఇంతకు ముందు నాని సినిమా 'శ్యామ్ సింఘా రాయ్' కి కూడా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ సినిమాకి అవినాష్ కి చాలా మంచి పేరు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల (Srikath Odela) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ దర్శకుడు కూడా రామగుండం నుండి వచ్చినవాడే. కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇందులో కథానాయికగా నటిస్తోంది.