Dasara: 2,700 స్క్రీన్స్, 18 కోట్లు ఇదీ నాని దెబ్బ
ABN , First Publish Date - 2023-03-29T15:14:55+05:30 IST
నాని సినిమా 'దసరా' రేపు విడుదల అవుతోంది. ఎన్ని స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది, ఎంత రెవిన్యూ రావొచ్చు, బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తే మాత్రం...
నాని (Nani) 'దసరా' (#Dasara) సినిమా ఊపందుకుంది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే కనపడుతోంది. నాని ఈ సినిమాకి దేశం అంతా తిరిగి ప్రచారం చేసాడు. విడుదలకి ముందు జరిగే వ్యాపారం కూడా చాలా అద్భుతంగా వుంది. రేపు అంటే మార్చి 30, శ్రీరామనవమి (Sriramanavami) పండగ నాడు అన్ని భాషల్లోని విడుదల అవ్వటానికి ఈ సినిమా సర్వం సిద్ధం అయింది. ఇందులో కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయిక. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దీనికి దర్శకుడు.
ఇప్పుడు ఇంకో షాకింగ్ వార్త ఏంటి అంటే ఈ సినిమా మొదటి రోజు ఎన్ని స్క్రీన్స్ లో ప్రదర్శింపబడుతోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 2,700 పై చిలుకు స్క్రీన్స్ లో 'దసరా' (#Dasara) సినిమా విడుదల అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 (900 theaters in Telugu states) కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవుతోంది అంటే ఇది పెద్దగా విడుదల చేస్తున్నారో అర్థం చేసుకోండి.
ఇలా ఇంత పెద్దగా నాని సినిమా విడుదల కావటం, ఇంత బిజినెస్ చెయ్యడం ఇది మొదటి సారి. అయితే ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లు రాబట్టాలి హిట్ టాక్ రావాలంటే అని అనుకున్నాం కదా, మరి ఇన్ని స్క్రీన్స్ లో దేశం అంతా ఇలా విడుదల అవుతుంటే మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం ఏరియాలో (Nizam Area) మల్టీప్లెక్స్ అన్నీ కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి. ఈమధ్య కలం లో ఇంతలా ఏ సినిమాకి కూడా లేవు, అలా అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ అయిపోయాయి. అందులోకి రేపు సెలవు కూడా కావటం తో మరింత తొందరగా బుక్ అయిపోతున్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే సుమారు 300 కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది అంటున్నారు. హిందీ, అలాగే మిగతా భారత దేశం అంతటా కలిపి 750 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. అన్ని దగ్గర్లా ఈ సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి అని అంటున్నారు.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తున్న దాన్ని బట్టి ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ. 15 నుండి 18 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్టు చేయవచ్చు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఇది పెద్ద స్టార్ సినిమా కలెక్టు చేసినట్టుగా కలెక్టు చేస్తే అది రికార్డు బ్రేక్ అవుతుంది. నాని సినిమా ఇంతలా కలెక్ట్ చేస్తుంది అంటే, నాని మార్కెట్ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
అయితే నాని కూడా ఈ సినిమాకి అంతలా ప్రచారాలు చేసాడు. ఈ సినిమా మీద వున్న నమ్మకంతో, దర్శకుడు కొత్త వాడు అయినా కూడా, దేశం అంతా తిరిగి సినిమా గురించి చెప్పాడు. మరి సినిమా ఎలా ఉండబోతోందో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.