Nani: అప్పుడు కొత్తోడు అనుకుంటే.. ఇప్పుడు నేను ఎవర్ని!

ABN , First Publish Date - 2023-03-19T17:14:17+05:30 IST

నాని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయింది(Nani Completes 15 years). విభిన్నమైన పాత్రలు ఎంచుకుటే నేచురల్‌ స్టార్‌గా ఎదిగారు.

Nani: అప్పుడు కొత్తోడు అనుకుంటే.. ఇప్పుడు నేను ఎవర్ని!

నాని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయింది(Nani Completes 15 years). విభిన్నమైన పాత్రలు ఎంచుకుటే నేచురల్‌ స్టార్‌గా ఎదిగారు. ఈ జర్నీలో ఆయన అనుభవమున్న దర్శకులతో పనిచేశారు. కొత్తవారికీ అవకాశాలిచ్చారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్త దర్శకుల వైపే ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు అన్న ప్రశ్నకు నాని ఆసక్తి (Nani Comments on New Directors) సమాధానమిచ్చారు. ‘‘దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. కొత్తవారితోనే చేయాలనే రూల్‌ లేదు. అనుభవం ఉన్న వారితో చాలా సినిమాలు చేశా. కానీ టాలెంట్‌ అనేది కొత్తది, పాతది కాదు. టాలెంట్‌ ఈజ్‌ టాలెంట్‌ అంతే దానికి కొత్త, పాత అనే తేడా ఉండదు. కొత్తతరం రావాలి. 2008లో నాని కొత్త అనుకుంటే ఈ రోజు నేను లేను. ఇక్కడ ఉండేవాడిని కాదు. చాలామంది ఈ సినిమాను పులి మీద స్వారీ అంటున్నారు. ఓడిపోతామనుకునేవాళ్లకు పులి మీద స్వారీలా అనిపించవచ్చు. నాకు ఆ భయం లేదు’’ అని అన్నారు నాని. ఆయన నటించిన తాజా చిత్రం ‘దసరా’ ఈ నెల 30న విడుదల కానుంది.

2.jpg

ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నాని ఆదివారం విశాఖపట్నం వెళ్లారు. అక్కడ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో వన్డే ప్రారంభానికి ముందు స్టేడియంలో సందడి చేశారు. మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar), Msk ప్రసాద్‌, ఆరోన్‌ ఫించ్‌తో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇష్టమైన క్రికెటర్‌ సచిన్‌ అని చెప్పిన నాని ఆటలో అతను ఔట్‌ అయ్యాడంటే టీవీ ఆపేసే వాళ్లం అని చెప్పారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌కు ‘దసరా’ (Dasara) లోని ‘ధూమ్‌ ధామ్‌’ సిగ్నేచర్‌ స్టెప్‌ను నాని నేర్పించారు. ఇద్దరూ కలిసి ఆ స్టెప్పు వేసే సరికి స్టేడియం ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది.

తెలుగు కామెంటరీ టీమ్‌తో మాట్లాడుతూ.. నాని నటించిన సినిమా పేర్లు ఏ క్రికెటర్లకు బాగుంటాయి అన్నది చెప్పారు. టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ‘జెంటిల్‌మెన్‌’ టైటిల్‌ ఇచ్చాడు నాని.

విరాట్‌ కోహ్లీ: ‘గ్యాంగ్‌ లీడర్‌’,

హార్దిక్‌ పాండ్య: పిల్ల జిమిందార్‌ టైటిల్‌ బాగుంటుందని చెప్పారు.

Updated Date - 2023-03-19T17:18:52+05:30 IST