Nandamuri Balakrishna: భగవంత్ కేసరిలో తండ్రిని కూడా గుర్తు చేసిన బాలకృష్ణ
ABN , First Publish Date - 2023-06-10T16:05:51+05:30 IST
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'భగవంత్ కేసరి' సినిమా నుండి ఒక టీజర్ ని ఈరోజు విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నందమూరి అభిమానులకు ఉర్రూతలూగించింది. ఈ టీజర్ చిన్న రెట్రో మ్యూజిక్ తో ఎండ్ అవుతుంది, ఆ మ్యూజిక్ తన బాలకృష్ణ తండ్రిని గుర్తుకు తెస్తుంది, ఎందుకంటే ఆ మ్యూజిక్ ఎన్టీఆర్ పాత సినిమాలోది అని తెలుస్తోంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi) తో చేస్తున్న సినిమా 'భగవంత్ కేసరి' #BhagavanthKesari నుండి ఒక చిన్న టీజర్ ని విడుదల చేశారు. బాలకృష్ణ ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు చేసినా, అటువంటి పాత్రల్లో ఎన్ని చూసినా, ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 'భగవంత్ కేసరి' టీజర్ లో కూడా బాలయ్య కొత్తగా కనిపిస్తూ, కొత్త డైలాగ్స్ చెపుతూ అదరగొట్టాడు. ఈసారి హిందీలో ఒక డైలాగ్ పెట్టి అనిల్ రావిపూడి బాలకృష్ణని వైవిధ్యంగా చూపించాడు ఈ టీజర్ లో. #NBK
‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ అని బాలయ్య విలన్స్‌కి తాను ఎవరో ఏంటో చెప్పే సన్నివేశం చాలా పవర్‌ఫుల్‌గా తీసాడు అనిల్ రావిపూడి. ‘ఈ పేరు చానా యేళ్లు యాదుంటది’ అని బాలయ్య తెలంగాణ భాషలో చెప్పిన డైలాగ్ కూడా అదిరింది. అయితే ఈ టీజర్ ఒక చిన్న రెట్రో మ్యూజిక్‌తో ఎండ్ అవుతుంది. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్కడో విన్నట్టు అనిపించటం లేదూ?
అవును అది బాలకృష్ణ తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు (NTR) నటించిన 'భలే తమ్ముడు' సినిమాలోది అని తెలుస్తోంది. అందులో పాటలు అన్నీ హిందీ పాటలు పాడే గాయకుడూ మొహమ్మద్ రఫీ (MohammadRafi) చేత పాడించారు అప్పట్లో ఎన్టీఆర్ (NandamuriTarakaRamarao). గొంతు అనుకరణ సరిగ్గా లేకపోయినా, రఫీ చేత పాటలు పాడించాలి అని పాడించుకున్నారు ఎన్టీఆర్, ఆ పాటలు అన్నీ సూపర్ హిట్ సాంగ్స్.
ఆలా ఆ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట పాడుతూ గిటార్ వాయిస్తూ వుంటారు. 'ఎంతవారు గాని వేదాంతులైన గాని' అనే పాట మొహమ్మద్ రఫీ పాడారు. కె ఆర్ విజయ ఇందులో కథానాయిక. ఆ పాటలో కూడా ఇప్పుడు బాలకృష్ణ టీజర్ లో వున్న మ్యూజిక్ వినపడుతుంది. బాలకృష్ణ టీజర్ లో ఆ రిట్రో మ్యూజిక్ తో అతని తండ్రి ఎన్టీఆర్ ని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అవుతున్నాయి కదా, అందుకని బహుశా తన తండ్రిని కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని ఆ రెట్రో మ్యూజిక్ పెట్టినట్టు కనపడుతోంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (KajalAgarwal) కథానాయికగా నటిస్తోంది, కాగా టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) విలన్‌గా టీజర్ లో కనిపించాడు. దసరాకి బరిలోకి రానున్న ఈ ‘భగవంత్ కేసరి’ బాలకృష్ణ కి మరో బ్లాక్ బస్టర్ సినిమా అందుతుందని అభిమానులు చాలా సంతోషంగా వున్నారు.