కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika Deepfake video : మిగిలినవాళ్లకు బాధ్యత లేదా? నెటిజన్ల ప్రశ్న!

ABN, First Publish Date - 2023-11-07T12:52:57+05:30

ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు రష్మిక మందన్న డీప్‌ఫేక్‌ వీడియో (Rashmika Deepfake video) గురించే చర్చ నడుస్తోంది. ఎఐ టెక్నాలజీ ద్వారా ఎవరో వీడియోకి రష్మిక ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్‌ అయింది.

ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు రష్మిక మందన్న డీప్‌ఫేక్‌ వీడియో (Rashmika Deepfake video) గురించే చర్చ నడుస్తోంది. ఎఐ టెక్నాలజీ ద్వారా ఎవరో వీడియోకి రష్మిక ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్‌ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్నది బ్రిటీష్‌-ఇండియన్‌ సోషల్‌ మీడియా పర్సనాలిటీ జారా పటేల్‌. ఇప్పటికే దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించి ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ నుంచి మొదటగా హీరో నాగ చైతన్య రియాక్ట్‌ అయ్యారు. ఈ చర్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (Nagachaitanya reaction)

'‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటి కోసం కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి’ అంటూ రష్మిక చేసిన ట్వీట్‌కు చై ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల వల్ల తానే కాకుండా సొసైటీలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని రష్మిక తన ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై గాయని చిన్నయి కూడా స్పందించారు. ఇలాంటివి చాలా ప్రమాదకరమని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్‌ వీడియోలను అరికట్టాలని ఆమె కోరారు.

మిగిలిన హీరోలు ఏమైపోయారు...

రష్మిక ఇష్యూపై టాలీవుడ్‌ నుంచి స్పందించి, మద్దతుగా నిలిచిన తొలి హీరో నాగచైతన్య. రష్మికతో కలిసి అతను సినిమా కూడా చేయలేదు. కానీ మానవీయ కోణంలో ఓ మహిళకు, సాటి తార ఎదుర్కొన్న ఇబ్బందిని అర్థం చేసుకుని స్పందించారు. ఇప్పటి వరకు  టాలీవుడ్‌ నుంచి మరే అగ్ర హీరో, అగ్ర నటీమణులు కూడా స్పందించలేదు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి తార ఇబ్బందుల్లో ఉంటే సపోర్ట్‌గా నిలవాల్సిన బాధ్యత లేదా? అని సోషల్‌ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

Updated Date - 2023-11-07T12:55:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!