Thandel: చైతూ, సాయిపల్లవి, చందు మొండేటిల ఫిల్మ్ టైటిల్ ఇదే.. దుల్లకొట్టేదాం!
ABN , First Publish Date - 2023-11-22T14:42:14+05:30 IST
అక్కినేని నాగ చైతన్య నెక్ట్ ప్రాజెకక్టు నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా కార్తికేయ2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌లో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేపు నాగా చైతన్య జన్మదినం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.
అక్కినేని నాగ చైతన్య నెక్ట్ ప్రాజెకక్టు నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా నాగ చైతన్య (Naga Chaitanya) కార్తికేయ2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చందు మొండేటి (chandoo mondeti) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. #NC23గా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా చైతన్యకు జోడీగా సాయి పల్లవి మరోసారు జతకట్టనుంది, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే రేపు నాగ చైతన్య జన్మదినం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.
సెప్టెంబర్‌లో మేకర్స్ ఈ చిత్రాన్నిసెట్స్‌పైకి తీసుకు రాగా చిత్ర విశేషాలను ప్రకటిస్తూ విడుదల చేసిన నాగ చైతన్య, సాయి పల్లవిల వీడియోలు విడుదల చేయగా వాటికి భారీ స్పందన వచ్చి సోషల్ మీడియాలో కొంతకాలం ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ క్రమంలో రేపు నాగచైతన్య జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఒక్కరోజు ముందే సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ చేసి అక్కినేని అభిమానులకు అదిరిపోయే అప్టేట్ ఇచ్చి ఖుషీ చేశారు.
సినిమాకు తండేల్ (Thandel) అని పేరు పెట్టగా, లుంగీ అంచు నోట్లో పెట్టుకుని, గెడ్డం పెరిగిన మాన్లీ లుక్‌లో ఉన్న ఫొటోతో సమయాన్ని, ప్రజల కోసం ఇబ్బందులకు వ్యతిరేఖంగా పోరాడడానికి ఓ నాయకుడు పుట్టాడు అంటూ ట్యాగ్ లైన్‌ను జత చేసి ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయగా అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఇది కదా మేమఉ కోరుకున్నది అంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు. దీంతో సామాజిక మాధ్యమంలో ఈ పోస్టు బాగా వైరల్‌గా మారింది.
అయితే రెండు సంవత్సరాల క్రితం చేపల వేటకు వెళ్లిన ఆంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కి దాదాపు ఏడాదిన్నర అక్కడ జైలులో మగ్గి వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్కడ వారి కుటుంబం అనుభవించిన వ్యథల ఆధారంగా నిజ జీవిత ఘటనలకు ఓ ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.