Naga Chaitanya: ఫస్ట్‌ కిస్‌.. ఫస్ట్‌ డేట్‌.. ఎవరితో అంటే!

ABN , First Publish Date - 2023-05-08T00:01:40+05:30 IST

తన ఫస్ట్‌ కిస్‌ గురించి చెప్పుకొచ్చారు అక్కినేని నాగచైతన్య. ‘తాజాగా నటించిన ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు

Naga Chaitanya: ఫస్ట్‌ కిస్‌.. ఫస్ట్‌ డేట్‌.. ఎవరితో అంటే!

తన ఫస్ట్‌ కిస్‌ (First kiss and date) గురించి చెప్పుకొచ్చారు అక్కినేని నాగచైతన్య. ‘తాజాగా నటించిన ‘కస్టడీ’ (Custody) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఫస్ట్‌ కిస్‌, ఫస్ట్‌ డేట్‌ గురించి చెప్పమని యాంకర్‌ కోరగా ‘ఏ మాయ చేసావె’ సినిమాలోనే ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌స్ర్కీన్‌ కిస్‌ సీన్‌లో నటించానని చై చెప్పారు. ‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్‌ టైమ్‌ క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్‌ డేట్‌ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాను. ఆన్‌స్ర్కీన్‌ ఫస్ట్‌ కిస్‌ ‘ఏమాయ చేసావె’ సినిమాలో జరిగింది. ఆఫ్‌స్ర్కీన్‌లో ఎప్పుడనేది చెప్పను. అమ్మాఇయిలో నేను గమనించే మొదటి విషయం ఆమె వ్యక్తిత్వం. నాకు ఒంటరితనం అంటే ఇష్టం. కొన్ని సందర్భాల్లో అలా ఉండటానికే ఇష్టపడతా. అలా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు అర్థమవుతాయి. మంచి ఆలోచనలు పుడతాయి. జీవితంలో మరింత బ్యాలెన్స్‌గా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి’’ అని నాగచైతన్య చెప్పారు. అయితే ఆయన ఫస్ట్‌ కిస్‌ సమంతతోనే చైతన్య చెప్పకనే చెప్పారు. ఏమాయ చేశావె’లో చై, సామ్‌ కలిసి నటించారు. ఈ చిత్రంతో ఇద్దరికీ రెండు మూడు సన్నివేశాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాలు ఉన్న విషయమే.

నెపోటిజనం గురించి కూడా చైతన్య మాట్లాడారు. నెపోటిజం గురించి ఎందదుకు ఇంతగా చర్చిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరొక సినిమా పరిశ్రమకు చెందిన ఫ్యామిలీలో పుడితే.. ఇంట్లో వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సినిమా ఫ్యామిలీలో పుట్టినవాళ్లకు అలా ఆసక్తి కలుగుతుంది. అందులో ఎలాంటి తప్పులేదు. పరిశ్రమలో అడుగుపెట్టడానికి బ్యాగ్రౌండ్‌ ఉపయోగపడుతుంది. కానీ వన్స్‌ లొకేషన్‌లోకి వెళ్లాక సినీ నేపథ్యం ఉందా లేదా అన్నది ఎవరూ ఆలోచించరు. సినిమా బాగుంటే చూస్తారు. లేదంటే ఖాళీ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకున్నవాళ్లంటే నాకు చాలా గౌరవం. అలాగే ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పుడు తప్పకుండా మన ఫ్యామిలీలో ఉన్న హీరోలతోనే మనల్ని పోల్చి చూస్తుంటారు. నన్ను కూడా అలాగే పోలుస్తుంటారు. దాన్ని నేను తప్పుగా అనుకోను. సవాల్‌గా భావించి కష్టపడతాను. మరింత మంచి స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

Updated Date - 2023-05-08T07:17:28+05:30 IST