Naga Chaitanya: పదేపదే నా వ్యక్తిగత విషయాలు ఎందుకు?
ABN , First Publish Date - 2023-05-09T16:22:05+05:30 IST
నాగచైతన్య మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సమంతతో విడాకులు గురించి కొన్ని మీడియా సంస్థలు తరచూ ప్రశ్నించడం, ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహించారు.
నాగచైతన్య (Naga chaitanya) మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సమంతతో విడాకులు గురించి కొన్ని మీడియా సంస్థలు తరచూ ప్రశ్నించడం, ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహించారు. ‘కస్టడీ’(Custody Promotions) సినిమాలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకులు, తాజా రూమర్స్ గురించి ఆయన మాట్లాడారు. తమకు కోర్టు విడాకులు మంజూరు చేసి సంవత్సరమైనా ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్నే హైలైట్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు. (Naga chaitanya Fire on media)
‘నేను యాక్ట్ చేసిన సినిమాలు, అందులో నా యాక్టింగ్ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, విమర్శించినా నాకు ఫర్వాలేదు. కానీ, పదేపదే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మాత్రం బాధ కలుగుతుంది. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. కానీ, జరిగిపోయిన ఆ రోజులు, నా జీవితంలోని ఆ దశ అంటే ఎంతో గౌరవం ఉంది. గత రెండేళ్లుగా మీడియాలో నా వ్యక్తిగత విషయాలపై వస్తున్న రూమర్స్ వల్ల ఆ గౌరవాన్ని తీేసస్తున్నారు. ఇది నా మనసుకు ఎంతో బాధ కలిగిస్తోంది. మా ఇద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది పైనే అవుతుంది. ఇంకా అదే విషయాన్ని పట్టుకుని కూర్చున్నారు. మా ఇద్దరితో పాటు ప్రమేయం లేని ఇంకో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారు. వాళ్ల కుటుంబం ఎంత బాధపడుతుందనే కనీస ఆలోచన కూడా లేదు. నేను, సమంత మా విడాకుల విషయంపై స్టేట్‌మెంట్ ఇచ్చాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. (Samantha divorce)
నాగ చైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. ఇందులో ఉప్పెన చిత్రంలో బూబమ్మగా అలరించిన కృతీశెట్టి కథానాయికగా నటించింది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.