Naga Chaitanya : హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ఓనర్ షిప్ పొందారు
ABN , First Publish Date - 2023-09-14T16:56:40+05:30 IST
నాగ చైతన్యకు ఫార్ములా1, సూపర్‌కార్‌లు, మోటార్‌సైకిళ్లను అమితంగా ఇష్టపడతారు. ఆయనకు మోటార్‌స్పోర్ట్‌పై ప్యాషన్ వుంది. స్పోర్ట్స్ పట్ల అతని ఆసక్తి, ఉత్సాహం, ఇండియన్ మోటార్‌స్పోర్ట్ డొమైన్ సమగ్ర వృద్థికి దోహదపడే గొప్ప ఉద్దేశంతో రేసింగ్ టీంలో ఇన్వెస్ట్ చేశారు.
నాగ చైతన్యకు (Akkineni Nagarjuna) ఫార్ములా1, సూపర్‌కార్‌లు, మోటార్‌సైకిళ్లను అమితంగా ఇష్టపడతారు. ఆయనకు మోటార్‌స్పోర్ట్‌పై ప్యాషన్ వుంది. స్పోర్ట్స్ పట్ల అతని ఆసక్తి, ఉత్సాహం, ఇండియన్ మోటార్‌స్పోర్ట్ డొమైన్ సమగ్ర వృద్థికి దోహదపడే గొప్ప ఉద్దేశంతో రేసింగ్ టీంలో ఇన్వెస్ట్ చేశారు. మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్(Hydrabad black birds) ఓనర్ షిప్‌ని పొందారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్థమైంది.
నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘మోటార్‌స్పోర్ట్‌లో భాగం కావాలని ఎప్పుడునుంచో చూస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌లో భాగమైనందుకు చాలా అనందంగా వుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌లో ఔత్సాహికులందరికీ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. అలాగే యువ ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. ఈ సీజన్‌లో స్ర్టీట్ రేసుల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది వీక్షకులకు గొప్ప అనుభవంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ని వయసుల వారికి మోటార్‌స్పోర్ట్ పట్ల అవగాహన పెరుగుతుండటంతో, దానిలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం. దీనికి కారణమైన అఖిల్‌రెడ్డికి కృతజ్ఞతలు’’ అని అన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తొలి సంవత్సరంలో, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అందరి ప్రశంసలు అందుకుంది. జట్టులోని ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు, అఖిల్ రవీంద్ర, నీల్ జానీ, డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రశంసనీయమైన 1-2 ఫినిష్‌ని సాధించారు.యూనిట్‌గా, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్స్ ఛాంపియన్‌షిప్ రెండవ స్థానాన్ని పొందింది. వారి ఆశయాలను పెంచుకుంటూ, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఈ సంవత్సరం ఎఫ్‌ఐఎ-సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు సిద్థమవుతోంది, ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా వర్థమాన, ఔత్సాహిక రేసర్‌లను ఆకర్షించడానికి ఎదురుచూస్తోంది.