Naga Chaitanya: సమంత గురించి చై ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2023-05-05T18:47:55+05:30 IST

విడాకులు అనంతరం తొలిసారి సమంత గురించి మాట్లాడారు అక్కినేని నాగచైతన్య. తన మాజీ భార్య మంచి మనసున్న వ్యక్తి అని చైతూ చెప్పారు.

Naga Chaitanya: సమంత గురించి చై ఏమన్నాడంటే...

విడాకులు అనంతరం తొలిసారి సమంత (Samantha) గురించి మాట్లాడారు అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaitanya). తన మాజీ భార్య మంచి మనసున్న వ్యక్తి అని చైతూ చెప్పారు. ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటునట్లు తెలిపారు. ఆయన నటించిన ‘కస్టడీ’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. (after divorce First time Chaitanya about samantha)

‘‘మేము విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతోంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది దాటింది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము ఎవరి దారుల్లో వాళ్లు ముందుకు వెళ్తున్నాం. జీవితంలోని ఎదురయ్యే ప్రతి దశను నేను గౌరవిస్తాను. సమంత మంచి మనిషి. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మఽధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది. నన్ను బాగా బాధ పెట్టిన విషయం అదే! ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే.. నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది. వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించినప్పుడు మొదట్లో పెద్దగా పట్టించుకోక మౌనంగా ఉండేవాడిని. ఇప్పటికీ నా పెళ్లి గురించే టాపిక్‌ తీసుకొస్తారు. ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు నాగచైతన్య.

Updated Date - 2023-05-05T18:47:55+05:30 IST