Chandrabose: ఘనంగా సన్మానం.. భావోద్వేగానికి లోనైన గీత రచయిత..

ABN , First Publish Date - 2023-04-02T19:53:35+05:30 IST

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రానికి గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఫలితంగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఈ మూవీ సత్తా చాటింది.

Chandrabose:  ఘనంగా సన్మానం.. భావోద్వేగానికి లోనైన గీత రచయిత..

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రానికి గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఫలితంగా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఈ మూవీ సత్తా చాటింది. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్స్‌లోను ‘నాటు నాటు’ అవార్డును అందుకుంది. ఈ పురస్కారాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ‌

ఎమ్‌ఎమ్. కీరవాణి (MM. Keeravani), గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ వేదికపై అందుకున్నారు. అవార్డును అందుకున్న తర్వాత చంద్రబోస్ తొలిసారిగా స్వగ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత మొదటి సారిగా సొంత ఊరు చల్లగరిగకు రావడంతోనే ప్రజలు చంద్రబోస్‌ను ఘనంగా సన్మానించారు. చేతిలో ఆస్కార్‌ను పట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చల్ల గరిగ నుడికారం, భాష, పదాల వల్లనే నాటు నాటు పాట పుట్టింది. పాటలో ఉపయోగించిన పదాలు ఈ గడ్డపై నేర్చుకున్నవే. ఇండియన్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చిన చిత్రాల్లో ఆస్కార్ గెలుచుకున్న భారతీయ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఊరి లైబ్రరీలోనే నాటు నాటు పాటకు బీజం పడింది. మా ఊరు చల్లగరిగ ప్రపంచాన్ని గెలిచింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఊరి లైబ్రరీని నా కష్టార్జితంతో పునర్ నిర్మిస్తాను. ఆ భవనానికి ఆస్కార్ గ్రంథాలయం అని పేరు పెడతాను’’ అని చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటను కూడా ఆయన పాడారు. అక్కడకు వచ్చిన ప్రజలను ఉర్రూతలూగించారు.

rrr.jpg

‘తాజ్‌మహల్‌’ సినిమాతో చంద్రబోస్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 1995లో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీలో ఆయన ‘మంచు కొండల్లోన చంద్రమా’ పాటను రచించారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్‌కు రాగానే తనకు తాజ్ మహల్ సినిమాలో పాట రాసేందుకు అవకాశమిచ్చిన రామా నాయుడును గుర్తు చేసుకుంటూ చంద్రబోస్ 28 ఏళ్లు వెనక్కి వెళ్లారు. ‘తాజ్ మహల్’ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌, సంఘవి, మోనికా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎంఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-02T19:54:59+05:30 IST