Oscars95: మొదటి సారి తెలుగు పాటని ఆస్కార్ లో లైవ్ లో

ABN , First Publish Date - 2023-03-13T07:14:10+05:30 IST

మొదటి సారిగా ఆస్కార్ 95 ఏళ్ల చరిత్రలో ఒక తెలుగు పాట లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వటం. చరిత్ర సృష్టించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలోని ఈ 'నాటు నాటు' పాట

Oscars95: మొదటి సారి తెలుగు పాటని ఆస్కార్ లో లైవ్ లో

తెలుగు పాట 'నాటు నాటు' (Naatu Naatu) చరిత్ర సృష్టించింది. ఇంకా అవార్డు ప్రకటించకముందే, మొదటి సారిగా ఒక తెలుగు పాటను ఆస్కార్ అవార్డు ఫంక్షన్ (Oscars95) లో లైవ్ గా చూపించటం. ఈ ఘనత ప్రతి తెలుగు వాడు, భారత దేశం గర్వించదగ్గ విషయం. దర్శకుడు రాజమౌళి (Rajamouli), సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani), ఈ పాటని రాసిన చంద్రబోస్ (Chandrabose) ఇంకా పాడిన వారు, కోరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) ఇంకా ఎంతోమంది కృషి ఈ పాట వెనకాల వుంది.

Naatu-Naatu.jpg

అటువంటి ఈ తెలుగు పాటని మొదటి సారిగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో లైవ్ గా చూపించటం, ఆ పాట అయ్యాక, మొత్తం అక్కడకి వచ్చిన హాలీవుడ్ నటీనటులు, సాంకేంతిక నిపుణులు అందరూ (Oscars95) లేచి నిలిచిని ఈ పాటలకి చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు. అంటే అక్కడి వారందరికీ కూడా ఈ పాట ఎంతలా ఆకట్టుకుందో తెలుస్తోంది.

deepikapadukone.jpg

భారతీయ నటి, దీపికా పడుకొనె (Deepika Padukone) ఈ పాట కి ఇంట్రొడక్షన్ ఇచ్చి, పాటకోసం కొంత చెప్పారు. నాటు అంటే ఏంటో కూడా తెలుసుకోండి అని చెప్పారు. ఈ పాట లైవ్ అనగానే చప్పట్లతో మారుమోగిపోయింది మొత్తం హాల్ అంతా.

ప్లే బ్యాక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కల భైరవ ఈ పాటని లైవ్ లో పాడారు.

Updated Date - 2023-03-13T07:23:23+05:30 IST