Oscars 2023: స్టేజ్‌పై ‘నాటు నాటు’ డ్యాన్స్‌కి రంగం సిద్ధం.. దుమ్ములేపబోయేది ఏవరంటే..

ABN , First Publish Date - 2023-03-12T13:57:42+05:30 IST

ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది (2023)లో జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.

Oscars 2023: స్టేజ్‌పై ‘నాటు నాటు’ డ్యాన్స్‌కి రంగం సిద్ధం.. దుమ్ములేపబోయేది ఏవరంటే..
RRR

ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది (2023)లో జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. దానికి కారణం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ పాడిన ఈ పాటకి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని స్టెప్పులకి వీదేశీయులు సైతం ఊగిపోయారు.

‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులతో పాటు పలు ఇతర అంతర్జాతీయ అవార్డులు ఈ పాటతో పాటు ఈ సినిమా సొంతం అయ్యాయి. దీంతో ఆస్కార్ అవార్డు కూడా కచ్చితంగా వస్తుందని మూవీ టీంతో పాటు భారత సినీ అభిమానులు అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈ తరుణంలోనే రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ ఈ పాటని లైవ్‌లో పాడమని ఆస్కార్ యాజమాన్యం ఆహ్వానించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి లారెన్ గాట్లీబ్ (Lauren Gottlieb) స్కార్ స్టేజ్‌పై ‘నాటు నాటు’కి కాలు కదపనున్నట్లు తెలిపి భారత సినీ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

Lauren.jpg

ఈ విషయాన్ని తెలుపుతూ లారెన్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్టులో.. ‘‘ప్రత్యేక వార్త!!! నేను ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శన ఇస్తున్నాను!!!!!! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై ఈ ప్రదర్శన ఇవ్వడానికి నేను చాలా ఆతృతగా, ఉత్సాహంగా ఉన్నాను. నన్ను విష్ చేయండి!!!’ అని చాలా సంతోషంగా రాసుకొచ్చింది.

Lauren1.jpg

భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం ఆస్కార్ వేడుక ప్రారంభం కానుంది. నిజానికి ఈ వేడుకలో ‘నాటు నాటు’ పాటకి ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram Charan) కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని, ఈ నటుల అభిమానులు ఆశపడ్డారు. కానీ అది కుదరదని తెలియడంతో కొంచెం నిరాశ చెందారు. ఈ తరుణంలో లారెన్ షేర్ చేసిన ఈ విషయం వారికి కొంచెం ఉపశమనం ఇచ్చినట్లైంది. దీంతో వారు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Updated Date - 2023-03-12T14:05:50+05:30 IST