Naatu Naatu : ‘నాటు నాటు’ ఫీవర్‌ తగ్గేదేలే!

ABN , First Publish Date - 2023-03-16T16:06:49+05:30 IST

అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ అవార్డ్‌ (Oscar 2023) అందుకున్న ‘నాటు నాటు’ (naatu naatu) పాటకు యావత్‌ భారతావని నీరాజనం పలుకుతోంది. వేదిక ఏదైనా ‘నాటు నాటు’ పాట వినపడాల్సిందే.

Naatu Naatu : ‘నాటు నాటు’ ఫీవర్‌ తగ్గేదేలే!

అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌ అవార్డ్‌ (Oscar 2023) అందుకున్న ‘నాటు నాటు’ (naatu naatu) పాటకు యావత్‌ భారతావని నీరాజనం పలుకుతోంది. వేదిక ఏదైనా ‘నాటు నాటు’ పాట వినపడాల్సిందే. సెలబ్రిటీ ఎవరైనా కాలు కదపాల్సిందే. అంతగా ఈ పాట ప్రేక్షకుల్ని అలరించింది. ‘ఆస్కార్‌’ అందుకున్న మరుసటి రోజు క్రికెట్‌ స్టేడియంలో సునీల్‌ గవాస్కర్‌ ‘(Sunil Gavaskar) నాటు నాటు’ పాటకు అవార్డు రావడం పట్ల చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా ఆ పాటకు స్టెప్‌ కూడా వేశారు. తాజాగా భారత మాజీ క్రికెటర్లు హర్భన్‌సింగ్‌, (Harbhajan Singh) సురేష్‌ రైనా (Suresh Raina)క్రికెట్‌ స్టేడియంలో ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Indian Cricketers Dance For NAatu naatu)

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయ వేదికలపై పలు పురస్కారాలతోపాటు ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక అవార్డు ‘ఆస్కార్‌’ అందుకొని తెలుగు సినిమా సత్తా చాటింది.

Updated Date - 2023-03-16T16:06:50+05:30 IST