Thaman S: నెటిజన్లకు కౌంటర్‌!

ABN , First Publish Date - 2023-02-05T18:35:01+05:30 IST

ఎప్పుడు సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లే.. తమన్‌ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తనపై నెగటివ్‌ కామెంట్స్‌ చేసే వాళ్లకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

Thaman S: నెటిజన్లకు కౌంటర్‌!

ఎప్పుడు సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లే.. తమన్‌(Thaman) ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తనపై నెగటివ్‌ కామెంట్స్‌ చేసే వాళ్లకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా (Thaman counter to trollers) ఓ పోస్ట్‌ చేశారు. తనని కామెంట్‌ చేస్తూ, ట్రోల్‌ చేస్తున్న వాళ్లందరూ చిన్న పిల్లలంటూ సెటైర్‌ వేశారు. ఇటీవల ‘అఖండ’, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘వీర సింహారెడ్డి వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు సంగీతం అందించారు తమన్‌. ఈ చిత్రాల సక్సెస్‌లో సంగీతం కీలక పాత్ర పోషించిందని సంగీత ప్రియులు, విమర్శకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్‌సీ15’, ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. (Thaman Fire on netizens)

దీనిపై కొందరు నెటిజన్లు ‘తమన్‌ సంగీతం అసలు బాగోదని,. వినాలనిపించదని పలువురు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై తమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియో ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి!! చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-02-05T18:35:02+05:30 IST