Atharva: అనసూయమ్మ అందిస్తోన్న ‘అథర్వ’ ఆగమనం అప్పుడే!

ABN , First Publish Date - 2023-05-02T21:18:39+05:30 IST

ప్రేక్షకుల అభిరుచిని గమనించిన నూతన దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే

Atharva: అనసూయమ్మ అందిస్తోన్న ‘అథర్వ’ ఆగమనం అప్పుడే!
Karthik Raju in Atharva Movie

చిన్న చిత్రమా.. పెద్ద చిత్రమా అనే తేడాలు లేకుండా.. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అటు కమర్షియల్ చిత్రాలను ఆదరిస్తూనే, ఇటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని గమనించిన నూతన దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ‘అథర్వ’ చిత్రమని అంటున్నారు మేకర్స్. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ (Peggo Entertainments) బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అథర్వ’. డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి (Mahesh Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి (Subhash Nuthalapati) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నట్లుగా తెలుపుతూ.. విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌, టీజర్, ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్‌లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు (Atharva Release Update) చేస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఇక ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో హ‌త్య జ‌రిగిన‌ప్పుడు క్లూస్‌ను సేక‌రించే టీమ్‌లో హీరో ప‌ని చేస్తాడ‌నేది తెలుస్తుంది.

అలా వర్క్ చేసే హీరో.. త‌ను ఎలాంటి మిస్ట‌రీల‌ను ఛేదించాడ‌నేదే ఈ ‘అథర్వ’ చిత్రం అనేలా టీజర్‌తో (Atharva Teaser Talk) మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టీజర్‌తోనే ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇక ట్రైలర్‌తో ఎలా ఆకట్టుకుంటుందో.. సినిమాపై ఏ విధంగా క్రేజ్‌ని తీసుకోస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. కాగా.. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

Updated Date - 2023-05-02T21:18:39+05:30 IST