Mrunal Thakur: నాకు పూర్తిగా తెలీదు... కానీ అలా జరిగితే...

ABN , First Publish Date - 2023-04-10T11:14:45+05:30 IST

ప్రేమకథలను హృద్యంగా తెరకెక్కించడంలో హను రాఘవపూడిది ప్రత్యేక శైలి. అందుకు నిదర్శనం ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలే.

Mrunal Thakur: నాకు పూర్తిగా తెలీదు... కానీ అలా జరిగితే...

ప్రేమకథలను హృద్యంగా తెరకెక్కించడంలో హను రాఘవపూడిది(Hanu Raghavapudi) ప్రత్యేక శైలి. అందుకు నిదర్శనం ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలే. ‘అందాల రాక్షసి’(Andala rakshasi) మొదలుకొని ‘కృష్ణగాడి వీర్రపేమగాథ’, ‘పడిపడి లేచే మనసు’ అన్ని ఆ తరహా చిత్రాలు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ (Sita Ramam) ప్రేమకథల్లో మరోస్థాయిలో ఉంటుంది. ఆ చిత్రం ఎంతగా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ అనాధ, ఆర్మీ, స్వచ్చమైన ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal thakur)( సీత పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తాజాగా ‘సీతారామం -2 (Sitaramam2) గురించి ఓ ఆసక్తికర విషయాన్ని నెట్టింట షేర్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు మృణాల్‌.

1.jpg

‘సీతారామం 2’ (Sita Ramam 2)ఉంటుందా? అని ఓ అభిమాని మృణాల్‌ను ప్రశ్నించాడు. అందుకు ఆమె ‘‘ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ‘సీతారామం 2’ ఉండాలనుకుంటున్నాను’ బదులిచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ప్రేమకథకు, భావోద్వేగాలకు కనెక్ట్‌ అయిన చాలామంది ఈ చిత్రానికి కొనసాగింపు ఉండాలని కోరుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మృణాల్‌ ‘సీతారామం 2’ ఉంటే బాగుంటుందని చెప్పడంతో ఈ మూవీ సీక్వెల్‌ పై మళ్లీ ఆసక్తి నెలకొంది. మరి దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ‘సీతారామం’ తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ చక్కని ప్రేమకథగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తెలుగులో ‘నాని 30’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.

Updated Date - 2023-04-10T11:21:55+05:30 IST