Mrunal Thakur: విజయ్‌తో కెమిస్ట్రీ పండించగలదా?

ABN , First Publish Date - 2023-06-23T11:13:29+05:30 IST

విజయ్‌ దేవరకొండ పరశురామ్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘సీతా రామం’లో సీతగా అలరించిన మృణాల్‌ ఠాకూర్‌ను ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో తొలుత పూజా హెగ్డేను కథానాయుకగా అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో మృణాల్‌ వచ్చి చేరింది. అయితే విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌, స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌కు అతని సరసన ఎంతవరకూ సూట్‌ అవుతుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు

Mrunal Thakur: విజయ్‌తో కెమిస్ట్రీ పండించగలదా?

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పరశురామ్‌ (parasuram) కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘సీతా రామం’లో సీతగా అలరించిన మృణాల్‌ ఠాకూర్‌ను (Mrunal thakur) ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో తొలుత పూజా హెగ్డేను కథానాయుకగా అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో మృణాల్‌ వచ్చి చేరింది. అయితే విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌, స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌కు అతని సరసన ఎంతవరకూ సూట్‌ అవుతుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నటన పరంగా మృణాల్‌ మెప్పించినా, కెమిస్ట్రీ విషయంలో న్యాయం చేయగలదా అన్న సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు హాట్‌ హాట్‌ అందాలతో మెప్పించడమూ మృణాల్‌కు తెలుసు. కానీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ‘సీతా రామం’లో సీతగా, తమ పక్కింటి అమ్మాయిగానే భావిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ చిత్రాల్లో రొమాన్స్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రేంజ్‌లో మృణాల్‌ మెప్పించ గలదా అన్నదే ప్రస్తుత ప్రశ్న. మరి దర్శకుడు మృణాల్‌ పాత్రను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.

అయితే ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ డాక్యుమెంటరీ డైరెక్టర్‌గా (Mrunal Thakur As Director) కనిపించబోతోందని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ డాక్యుమెంటరీ కోసం అమెరికా నుంచి.. ఇండియా వస్తుంది హీరోయిన్‌. హీరోతో పరిచయం ఏర్పడుతుంది. అలా వీళ్లిద్దరి మధ్య లవ్‌ జర్నీ మొదలువుతుంది. హీరోది నిరుద్యోగి పాత్ర. ఆ ప్రయత్నాల్లో ఉంటూ అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే హీరోకి.. తన లవ్‌ స్టోరీకీ మధ్య ఉండే స్ట్రగుల్‌ ఫైనల్‌గా ఏమైంది అన్నదే సినిమా ఇతివృత్తం. ఈ చిత్రానికి ‘కుటుంబరావు’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు (Dil raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Updated Date - 2023-06-23T11:14:02+05:30 IST