MM Srilekha: 25 దేశాల్లో 25 గాయకులతో సంగీత ప్రయాణం
ABN , First Publish Date - 2023-02-17T15:20:16+05:30 IST
ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ (MM Srilekha) సినిమా రంగానికి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసింది. అందుకని ఆమె ఒక స్పెషల్ ఈవెంట్ చేయడానికి సంసిద్ధురాలు అయ్యారు

ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ (MM Srilekha) సినిమా రంగానికి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసింది. అందుకని ఆమె ఒక స్పెషల్ ఈవెంట్ చేయడానికి సంసిద్ధురాలు అయ్యారు. శ్రీలేఖ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ (World Music Tour) మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారు. దీని కోసం ఒక పోస్టర్ ని కూడా డిజైన్ చేశారు. శ్రీలేఖ తన సినిమాల్లోని పాటలను, 25 మందికి చెందిన వివిధ గాయకులతో 25 దేశాలు తిరిగి ఈ మ్యూజిక్ ఈవెంట్ చేస్తారు.
ప్రపంచంలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న దర్శకుడు SS రాజమౌళి (SS Rajamouli) ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో, 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ అని అటువంటి ఆమె ఇంకా ఎన్నో సినిమాలకి సంగీతం అందించి అలరించాలని తన అభిననందనలు అందించారు.
ఆస్కార్ అవార్డులకు (Oscar Awards) వెళుతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు శ్రీలేఖ. ఆమె ఈసందర్భంగా రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలి సీరియల్ 'శాంతినివాసం' కి తాను సంగీతం అందించానని చెప్పారు. (Oscars2023) ఇప్పుడు తన టూర్ పోస్టర్ కూడా తన అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. తన ఈ మ్యూజిక్ టూర్ మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు.