Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
ABN , First Publish Date - 2023-03-18T20:59:04+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అవార్డును అందుకోవడంతోనే ఈ పాటకు బ్రహ్మారథం పట్టే వారి సంఖ్య అధికమైంది. అయితే, ఈ పాటను మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్. కీరవాణి (MM Keeravani) తండ్రి శివశక్తి దత్తా (Siva Shakthi Datta) తీవ్రంగా విమర్శించారు. ‘‘అదొక పాటా..?’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. ‘నాటు నాటు’ కు ఆస్కార్‌పై స్పందించమని అడగగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మీకు నాటు నాటు సాంగ్ నచ్చిందా?' అని శివశక్తి దత్తాను అడగగా అనుకోని సమాధానమిచ్చారు. ''అదొక పాటా? అందులో మ్యూజిక్ ఎక్కడ ఉంది నా ముఖం? ఇది ఒక విధి విలాసం. విధి విచిత్ర వైచిత్యం'' అని ఆయన తెలిపారు. తన కుమారుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఇన్నాళ్లు చేసిన కృషికి ఈ పురస్కారం రూపంలో ప్రతిఫలం వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబోస్ రాసిన ఐదు వేల పాటల్లో అదొక పాటా? కీరవాణి సంగీతం అందించిన పాటల్లో అదొక పాటా? అదొక సంగీతమా? అని శివశక్తి దత్తా ప్రశ్నించారు.
'నాటు నాటు...' పాటలో సంగీతం, సాహిత్యం కంటే కొరియోగ్రఫీ తనకు ఎక్కువగా నచ్చిందని శివశక్తి దత్తా చెప్పారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ అద్భుతమని తెలిపారు. నృత్య దర్శకుడికి ప్రశంసలు దక్కాలని పేర్కొన్నారు. ఆ పాట వెనుక మాస్టర్ బ్రెయిన్ రాజమౌళి అని స్ఫష్టం చేశారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..
NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!