Minister Malla Reddy: మరో సినిమాకు మంత్రి మల్లారెడ్డి సపోర్ట్
ABN , First Publish Date - 2023-03-27T20:36:13+05:30 IST
రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి (Telangana Minister Malla Reddy) పేరు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలో విలన్‌గా

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి (Telangana Minister Malla Reddy) పేరు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలో విలన్‌గా చేయమని వచ్చిన అవకాశాన్ని కాదనుకోవడమే. ఆ విషయాన్ని పబ్లిక్‌గా అనౌన్స్ చేయడంతో.. అంతటా మల్లారెడ్డిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా వేడుక నిమిత్తం హాజరైన మంత్రి మల్లారెడ్డి పై విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ విషయం చెప్పిన అనంతరం మరో సినిమాకు ఆయన సపోర్ట్ అందించడం విశేషం. కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ (Gharshana Srinivas) సమర్పణలో.. రమణారెడ్డి గడ్డం (Ramana Reddy Gadam) దర్శకత్వంలో విశాల పసునూరి (Vishala Pasunuri) నిర్మిస్తోన్న చిత్రం ‘సిఐ భారతి’ (CI Bharathi). నరేంద్ర (Narendra), గరిమా (Garima) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై.. చిత్రయూనిట్‌కు సపోర్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో నటుడు అలీ (Ali) క్లాప్ కొట్టగా.. మంత్రి మల్లారెడ్డి చిత్రయూనిట్‌కు స్ర్కిప్ట్ అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు రమణారెడ్డి గడ్డం మాట్లాడుతూ.. రొటీన్‌కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పవర్‌ఫుల్ స్టోరితో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మంత్రి మల్లారెడ్డిగారు, నటుడు అలీగారు సపోర్ట్ అందించడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చి.. టీమ్‌ను ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఆవులు పశుగ్రాసం లేక చెత్త కుప్పల దగ్గర పేపర్లు తినే పరిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టడం జరిగింది. మా సినిమా ద్వారా వచ్చే రిటర్స్న్‌లో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గతంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీదట కూడా కంటిన్యూగా సినిమాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయనున్నామని తెలిపారు. (CI Bharathi Movie Launch)
మంచి కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హీరోహీరోయిన్లు తెలపగా.. చిత్ర సమర్పకులు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దర్శకుడు రమణారెడ్డి బౌండెడ్ స్క్పిప్ట్‌తో వచ్చారు. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చాను. దర్శకుడు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. (CI Bharathi Movie Opening)
ఇవి కూడా చదవండి:
*********************************
*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!
*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?
*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్
*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..
*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు
*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?