'మైఖేల్' నాకు చాల స్పెషల్ జర్నీ: సందీప్ కిషన్

ABN , First Publish Date - 2023-02-02T18:15:37+05:30 IST

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఇంతకు ముందు ఎన్నడూ కష్టపడనంత ఈ 'మైఖేల్' (Michael) సినిమాకి కష్టపడ్డాడు. అందుకే అతను ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకున్నాడు.

'మైఖేల్' నాకు చాల స్పెషల్ జర్నీ: సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఇంతకు ముందు ఎన్నడూ కష్టపడనంత ఈ 'మైఖేల్' (Michael) సినిమాకి కష్టపడ్డాడు. అందుకే అతను ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకున్నాడు. ఇది సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా, దీనికి రంజిత్ జయకోడి (Ranjith Jayakodi) దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar), గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon), వరుణ్ సందేశ్ (Varun Sandesh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈమధ్య విడుదలైన టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా వున్నాయి. మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల కానున్న నేపధ్యంలో సందీప్ కిషన్ సినిమా విలేకరులతో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మైఖేల్ తో పాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా.. ఈ ఫీలింగ్ ఎలా వుంది ?

ఈ సినిమా కథకి, విజువల్ నెరేటివ్ కి, సినిమాకి పాన్ ఇండియా కెపాసిటీ వుంది. విజువల్ గా చాలా ఎక్సయిటింగ్ గా వుంది. యాక్షన్ చాలా ఫ్రెష్ గా, రియలిస్టిక్ వైబ్ తో వుంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

sundeep1.jpg

ఇందులో మీ పాత్ర వైల్డ్ గా ఉంటుందా ?

మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్ స్టర్ కాకపోయినా మైఖేల్ అనెన్ పాత్ర ఎగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఇంకోపక్క చాలా నెమ్మది కూడా కానీ సమయం వచ్చినప్పుడు ఎగ్రెసివ్ గా బిహేవ్ చేసే పాత్ర.

మైఖేల్ లో నిజ జీవితానికి సంబధించిన సంఘటనలు కనిపిస్తాయా ?

ఇందులో జరిగిన చాలా సంఘటనలు నాకైతే జరగలేదు. కానీ నిజంగా జరిగితే ఎలా వుంటుందని ఊహించి చేశాను. మైఖేల్ కి ఫ్రండ్స్ వుండరు. ఎవరితో మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సయిటింగా వుంటాయి. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ చేయలేదు.

మైఖేల్ జోనర్ ఏమిటి ?

ఇది చాలా యూనిక్ స్టొరీ. కొత్త నెరేటివ్ స్టయిల్ వుంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ చాలా బలంగా వుంటాయి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్ గాయ్స్. బ్యాడ్ పీపుల్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది.

మైఖేల్ ప్రాజెక్ట్ డిజైన్ ఐడియా ఎవరిదీ ?

ఈ సినిమా చేయాలనే ఆలోచన నాదే. దానికి సరపడే డైరెక్టర్ ని ఎంచుకోవడంతో సగం పని పూర్తయింది. భరత్ చౌదరి, మోహన్ రావు గారి లాంటి నిర్మాతలు తోడవ్వడంతో ఇక మా ద్రుష్టి అంతా ప్రోడక్ట్ ని సరిగా డెలివర్ చేయడంపైనే పెట్టాం. ఈ సినిమా చేయడమే మా సక్సెస్. ఇప్పటి వరకూ నేను చెయ్యాలనుకోని చేయలేనిది ఏమిటని అలోచించినపుడు మైఖేల్ ఐడియా వచ్చింది. రంజిత్ తీసిన ఒక సినిమా చూశాను. నా ఆలోచన ఆయనకి చెప్పిన నెల రోజుల తర్వాత మైఖేల్ కథ చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ తనకు ఏం కావాలో అది ఇస్తూ సపోర్టు చేసుకుంటూ వెళ్తున్న.

మైఖేల్ తారాగణం గురించి చెప్పండి ?

విజయ్ సేతుపతి గారి పాత్ర సినిమాని ఇరవై నిమిషాలు పాటు మోసుకెళుతుంది. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ఫ్రెష్ గా వుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతు పతి ఎప్పుడూ జంటగా కనిపించలేదు. ఇందులో వారి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంటుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ట్రిక్కిగా వుంటుంది. వీళ్ళంతా కథ, దర్శకుడిపై నమ్మకంతో చేశారు.

ఇంత మంచి నటీనటు ల తో పని చేయడం సవాల్ గా అనిపించిందా ?

లేదండీ. నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో ఎప్పుడూ భయపడలేదు. పాత్రని, సన్నివేశాన్ని అర్ధం చేసుకోవడంపైనే నా దృష్టి వుంటుంది.

ఈ సినిమాలో మీ కష్టం కనిపిస్తోంది. 18 రోజులు పాటు ఏం తీసుకోలేదని విన్నాం ?

ఈ కథలో మైఖేల్ పాత్రని కొట్టి ఐదు రోజులు పాటు తిండి తిప్పలు లేకుండా ఎక్కడో పారేసుంటారు. ఆ సీన్ చేస్తున్నపుడు నిజంగానే వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజులు పాటు డైట్ లో వున్నాను. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అప్పుడు ఒక ఫైట్ షూట్ చేశాం. పొరపాటున కాలు రాంగ్ గా లాండ్ కావడంతో ఇంక ప్యాకప్ చెప్పాం. దీంతో పాటు షూటింగ్ కూడా చాలా డార్క్ ఏరియాల్లో చేశాం. గాజు పెంకులు గుచ్చుకునేవే. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించుకున్న సినిమా ఇది. చాలా వర్క్ సాటిస్ఫాక్షన్ వుంది.

గ్యాంగ్ స్టర్ సినిమాల్లో మైఖేల్ ప్రత్యేకత ఏమిటి ?

గ్యాంగ్ స్టర్ ప్రపంచంలో సెట్ చేసిన ఎమోషనల్ డ్రామా ఇది. కథనం చాలా కొత్తగా వుంటుంది. మనం ఊహించిన దాని కంటే సర్ప్రైజ్ వుంటుంది.

sundeep2.jpg

అన్ని భాషల్లో మీరే డబ్బింగ్ చెప్పారా ?

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను.

నాని ప్రీరిలీజ్ ఈవెంట్ లో మీకు అదృష్టం కలసి రావాలని కోరుకున్నారు కదా ?

నాని చాలా స్వీట్. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినది రాలేదని చాలా మంది అంటారు. నాని చెప్పినట్లు ఈ సినిమాతో అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాను. మైఖేల్ దర్శకుడు రంజిత్ మేము అనుకున్న దాని కంటే గొప్ప సినిమా తీశాడు. మైఖేల్ విజువల్ గ్రాండియర్ ఎక్సయిటెడ్ మూవీ.

తమిళ్ ఫిల్మ్ మేకర్స్ తో తరచుగా సినిమాలు చేస్తున్నారు కదా ?

'మైఖేల్' లాంటి సినిమా చేయాలంటే నేను డైరెక్టర్ ని నమ్మడమే కాదు. నన్నూ డైరెక్టర్ నమ్మాలి. రంజింత్ నన్ను నమ్మారు. గొప్పగా తీశారు. తమిళ్ సినిమాల విషయానికి వస్తే అక్కడ కల్చర్, భాష నాకు తెలుసు. అందుకే విజయ్ సేతు గారు మైఖేల్ లో భాగమయ్యారు. ధనుష్ గారు కెప్టెన్ మిల్లర్ లో తీసుకున్నారు. దినితో పాటు తమిళ ఆడియన్స్ ని చాలా ప్రేమ లభించింది. అందుకే మైఖేల్ తమిళంలో కూడా షూట్ చేశాం.

'మైఖేల్' జర్నీలో సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?

ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను. బరువు తగ్గాను, స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నాను, అండర్ వాటర్ లో షూట్ చేశాం ఇవన్నీ ఎక్సయిటెడ్ గా చేశాను. మైఖేల్ చాలా స్పెషల్ జర్నీ.

కొత్త ప్రాజెక్ట్స్

'భైరవ కోన', 'బడ్డీ', 'కెప్టన్ మిల్లర్' సినిమాలు చేస్తున్నా. ఈ మూడు భిన్నమైన సినిమాలు. దీనితో పాటు 'ఫ్యామిలీ మ్యాన్ 3' వుంది. అలాగే త్వరలోనె మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.

Updated Date - 2023-02-02T18:15:38+05:30 IST