Chiranjeevi: మన్సూర్ వ్యాఖ్యలని ఖండించిన మెగాస్టార్, త్రిషకు మద్దతు

ABN , First Publish Date - 2023-11-21T12:07:10+05:30 IST

నటి త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. త్రిషకి పరిశ్రమలోని నటీనటులు అందరూ మద్దతు తెలుపుతున్నారు, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకి మద్దతు తెలుపుతూ ప్రకటన చేశారు.

Chiranjeevi: మన్సూర్ వ్యాఖ్యలని ఖండించిన మెగాస్టార్, త్రిషకు మద్దతు
Chiranjeevi condemns Mansool Ali Khan comments and supports Trisha

దక్షిణాదిలో అగ్ర నటీమణుల్లో ఒకరైన త్రిషపై (Trisha) నటుడు మన్సూర్ అలీఖాన్ (MansoorAliKhan) చేసిన వ్యాఖ్యలు సినిమా ప్రపంచంలో ఒక దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దక్షిణాదికి చెందిన చాలామంది నటీనటులు త్రిషకు మద్దతుగా సాంఘీక మాధ్యమంలో తమ సంఘీభావం తెలుపుతూ, మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈమధ్య విడుదలైన 'లియో' #Leo సినిమాలో త్రిష కథానాయికగా విజయ్ (Vijay) పక్కన చేసింది. దీనికి లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj) దర్శకుడు.

Chiranjeevi.jpg

ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ (MansoorAliKhan) ఒక పాత్ర పోషించాడు. ఆ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని అంటూనే, చాలా సినిమాల్లో ఉన్నట్లే ఈ సినిమాలో కూడా త్రిషతో రేప్ సన్నివేశం ఉంటుందని భావించానని, కానీ అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధపడ్డానంటూ మన్సూర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అతడి మాటలకు తాను ఎంతో బాధపడ్డాను అని ఇలాంటివి ఖండించాలని నటి త్రిష వెంటనే సాంఘీక మాధ్యమంలో చెప్పారు.

మన్సూర్ అలీఖాన్ తీరుపై చాలామంది సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు మండిపడ్డారు, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. జాతీయ మహిళా కమిషన్ (NationalCommissionforWomen) ఈ వ్యాఖ్యలకి స్పందించి వెంటనే మన్సూర్ మీద కేసు ఫైల్ చెయ్యమని తమిళ నాడు పోలీసులని ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ వివాదంపై మన్సూర్ స్పందిస్తూ, తాను త్రిషను ఆలా అనలేదని, ఎవరో కావాలని తన మాటలను ఎడిట్ చేసి ఆ వీడియో షేర్ చేసి తనను చాలా బ్యాడ్ చేస్తున్నారంటూ ఓ నోట్ షేర్ చేశాడు.

Trisha.jpg

త్రిషకు మద్దతుగా ఇప్పటికే టాలీవుడ్ నటుడు నితిన్ (Nithiin) స్పందించి తన సాంఘీక మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. అలాగే 'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, నేపధ్య గాయని చిన్మయి, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఇంకా చాలామంది రాజకీయ నాయకులు కూడా స్పందించారు. తాజాగా మన్సూర్ కామెంట్లపై మెగాస్టా్ర్ చిరంజీవి స్పందించి తాను త్రిష కి అండగా ఉంటానని చెప్పారు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికి చేసిన, నేను ఆ అమ్మాయికి మద్దతుగా వుండి, అండగా వుంటాను అని తన ప్రకటనలో చెప్పారు చిరంజీవి.


మరిన్ని టాలీవుడ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Updated Date - 2023-11-21T12:16:55+05:30 IST