Niharika marriage: రంగంలోకి చిరంజీవి, సర్ది చెప్పే దిశగా....
ABN , First Publish Date - 2023-03-20T13:51:21+05:30 IST
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం గురించి అనేక వార్తలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాగబాబు అన్నయ్య చిరంజీవి కూడా ఈ విషయం విని బాధపడ్డారని కానీ...
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తమ్ముడు నాగబాబు (Nagababu) కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇప్పుడు వార్తల్లో వైరల్ గా మారారు. నిహారిక వివాహం (Niharika marriage) గురించిన వార్తలు ఇప్పుడు ఎక్కడ చూసిన కనపడుతున్నాయి. మెగా ఫామిలీ (Mega Family) కి సంబంధించి ఎంటువంటి సంఘటన జరిగినా ముందుగా స్పందించే నాగబాబు తన కూతురు వివాహ విషయంలో ఇన్ని వార్తలు వస్తున్నా ఎక్కడా ఒక ప్రకటన కూడా చెయ్యలేదు. నిహారిక కొణిదెల (NIharika Konidela), చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) ల వివాహం డిసెంబర్ 9, 2020 న అట్టహాసంగా ఉదయపూర్ (Udaipur) లో జరిగింది.
వివాహానికి ముందు, నాగబాబు కూడా తన అల్లుడు గురించి చాలా గొప్పగా మాట్లాడేడు. తనకు ఎలాంటి అల్లుడు కావాలని అనుకున్నాడో అలంటి లక్షణాలున్న మంచి అల్లుడు దొరికినట్టు నాగబాబు చెప్పాడు. అయితే మరి ఇప్పుడు ఏమయిదో తెలియదు కానీ, చైతన్య జొన్నలగడ్డ తన ఇన్ స్టాగ్రామ్ నుండి నిహారిక వున్న ఫోటోస్ అన్నీ తొలగించాడు. అలాగే నిహారిక ని ఫాలో అవటం కూడా మానేసాడు. ఈమధ్య సెలబ్రిటీలు విడిపోతున్నారో, కలిసి ఉంటున్నారో చెప్పటం కోసం ఈ ఫాలో, అన్ ఫాలో చెయ్యడంతో పబ్లిక్ కి తెలిసిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే, నిహారిక తన సాంఘీక మాధ్యమం లో చైతన్య తో వున్న ఫోటోస్ అలానే ఉంచింది. డిలీట్ చెయ్యలేదు. ఇద్దరి మధ్య ఏమయి ఉంటుంది అనే విషయం మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది సాంఘీక మాధ్యమంలో.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం నాగబాబు అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) చైతన్య కుటుంబం తో మాట్లాడతారు అని కూడా అంటున్నారు. మెగా ఫామిలీ (Mega Family) లో కొంచెం నోటు దురుసు వున్న వ్యక్తి నాగబాబు కావటంతో, చిరంజీవి నాగబాబు కి క్లాస్ పీకి, ఇంక తనే చైతన్య కుటుంబం తో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇలా మెగా కుటుంబంలో మరో అమ్మాయి వివాహ విషయం గురించి వార్తల్లో ఉండటం చిరంజీవి చాలా బాధ పడినట్టు తెలిసింది. అదీ కాకుండా చిరంజీవి కుటుంబంకి కూడా నిహారిక అంటే చాలా ఇష్టం, అందుకని చిరంజీవి ఎలాగయినా ఇద్దరితో మాట్లాడి కలిసి వుండేటట్టు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మెగా ఫామిలీ నుండి అందిన వార్త. అసలు ఏమైంది, ఎందుకు ఇద్దరి మధ్య వివాదాలు వచ్చాయి అని చిరంజీవి ఆరా తీసినట్టుగా కూడా తెలిసింది. రానున్న రోజుల్లో దీనికి శుభం కార్డు పడే అవకాశం కూడా వుంది అని అంటున్నారు.