Tiger Nageswara Rao: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రవితేజ.. దొంగ వేటకి బయలుదేరేది ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-03-29T13:02:41+05:30 IST
మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుక వచ్చిన చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అన్నతో గొడవపడే తమ్ముడిగా ఆ సినిమాలో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సారి ఏప్రిల్ 7న ‘రావణాసుర’ (Ravanasura)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోలోగా ఈ ఏడాది ఓ హిట్టు కొట్టాలని ఊవ్విళ్లూరుతున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ని ఇటీవలే విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. దాంతో రావణుడిగా రవితేజ ఎలా ఉంటాడో చూడాలని ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రవితేజ మరో కొత్త ఎనౌన్స్‌మెంట్‌తో వార్తల్లో నిలిచాడు.
రవితేజ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తీకేయ 2’ చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 1970లో స్టువర్ట్‌పురం అనే ఊళ్లో పేరుమోసిన దొంగ (notorious thie) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మొదటిసారి అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ( RaviTeja Tiger Nageswara Rao official release date )
ఈ తరుణంలో ఈ చిత్రం గురించి మూవీ టీం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. రవితేజ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ని షేర్ చేశాడు. అందులో.. పొగలు కక్కుతూ వెళుతున్న రైలుపై కొరడా పట్టుకున్న ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. దానికి ‘ఈ సంవత్సరం ఇది మనందరికీ చాలా ప్రత్యేకమైనది. TigerNageswaraRao వేట అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూసిన.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈసారి దసరాకి రికార్డులు బద్దలు కొట్లేయబోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత వ్యవహారిస్తున్నాడు.
( Tiger Nageswara Rao official release date )
ఇవి కూడా చదవండి:
Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..
Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..
Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..
Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..
Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..
Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..
Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..
Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..
NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..