Manchu Vishnu-Kannappa: కలల చిత్రానికి శ్రీకారం!

ABN , First Publish Date - 2023-08-18T15:28:00+05:30 IST

మంచు విష్ణు కలల చిత్రం ‘భక్త కన్నప్ప’. ఎంతో కాలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన తపన పడుతున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

Manchu Vishnu-Kannappa: కలల చిత్రానికి శ్రీకారం!

మంచు విష్ణు (manchu Vishnu) కలల చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta kannappa) ఎంతో కాలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన తపన పడుతున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ‘కన్నప్ప’ (Kannappa) చిత్రాన్ని శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. భారీబడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిల ఈ చిత్రాన్ని నిర్మించడానికి మంచు విష్ణు ప్లాన్‌ చేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్‌ మరియు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌ బాబు (Mohan babu) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనాన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ విష్ణు మంచు సరసన కథానాయికగా కనిపిస్తారు.

2.jpg

‘‘స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో భక్త కన్నప్ప, అతని గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం. త్వరలో షూటింగ్‌ మొదలుపెట్టి సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం. ఇండియన్‌ ఫిలిం ఇండస్ర్టీలో గొప్ప నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారు’’ అని విష్ణు తెలిపారు.

Updated Date - 2023-08-18T15:28:00+05:30 IST