Manchu brothers fighting: మనోజ్ అనుచరుడిని కొట్టిన విష్ణు, దానికి మనోజ్ ఏమన్నాడు అంటే...
ABN , First Publish Date - 2023-03-24T11:40:24+05:30 IST
మంచు కుటుంబం మరోసారి వార్తల్లో వుంది. కొన్ని రోజుల క్రితమే మంచు మనోజ్ వివాహం అయింది అని ఆనందం గా వున్న సమయంలో, మంచు విష్ణు ఏమి చేసాడో తెలుసా...
ఈమధ్యనే మంచు మనోజ్ (Manchu Manoj) వివాహం, భూమా మౌనికతో (Bhuma Mounica) అయింది. వివాహం అయిన వెంటనే ఆ దంపతులు ఇద్దరూ వారి కుటుంబాల పెద్దల ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొంతమంది మంచు కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా వున్నారని కూడా అన్నారు. కానీ మనోజ్ తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈమధ్య కొన్ని మీడియా వాళ్ళతో మాట్లాడుతూ తనకి ఈ వివాహం ఇష్టమే అని మాట్లాడేరు. తనకి వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటమే కావాలి అని కూడా అన్నారు. వివాహం అయినపుడు విడుదల చేసిన ఫోటోస్ లో మోహన్ బాబు కూడా ఉండటం తో అతని ఇష్టం తోటే ఈ వివాహం జరిగిందని కూడా అనుకున్నారు.
అయితే అప్పుడు వివాహ ఫోటోల్లో మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఎక్కడా కనిపించలేదు. తిరుపతి లో మంచు మనోజ్ దంపతులు మాట్లాడుతూ చాలామంది తమ వివాహానికి చాలామంది (Manchu family) వ్యతిరేకంగా వున్నారని అయినా చివరికి ప్రేమే గెలిచిందని అన్నాడు. అయితే అతని మాటలను బట్టి విష్ణు ఈ వివాహానికి వ్యతిరేకం అని తెలుస్తోంది.
ఇప్పుడు మనోజ్ అనుచరుడిని అన్నయ్య విష్ణు వచ్చి కొట్టడం, దానికి మనోజ్ స్వయంగా ఆ వీడియో తీసి సాంఘీక మాధ్యమంలో పెట్టడం చోస్తుంటే ఇద్దరి అన్నదమ్ముల మధ్య అంత సయోధ్యగా ఉన్నట్టు అనిపించటం లేదు. ఇద్దరి మధ్య విబేధాలు వున్నా, ఎప్పుడూ బయటపడలేదు, కానీ ఈసారి మనోజ్ పెట్టాడు అంటే, అన్నయ విషయం లో పబ్లిక్ కి తెలియాలని అనుకున్నాడేమో.
స్వయంగా మనోజ్ వీడియో తీసి అన్నయ్య విష్ణు ఇలానే ఇళ్లలోకి దూరి ఇలా కొడుతూ ఉంటాడు అని చెప్పాడు. ఇది సిట్యుయేషన్ అని చెప్పాడు మనోజ్ ఆ వీడియో లో. అయితే ఆ గాడి తలుపులు కూడా ఎవరో బాదుతున్నారు వెనకాల నుండి. అక్కడ మోహన్ బాబు (Mohan Babu) గారి గొంతు కూడా వెనకాల వినపడుతోంది ఏమో అని అనుమానంగా వుంది.