Manchu Manoj Marriage: భూమా మౌనిక తో పెళ్లి తేదీ ఖరారు అయింది
ABN , First Publish Date - 2023-02-27T15:08:31+05:30 IST
మంచు మనోజ్ (#ManchuManoj) మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక (#BhumaMounica) తో కలిసి సీతాఫలమండి (#Seethaphalmandi) లో ఒక వినాయక మంటపంకి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది.
మంచు మనోజ్ (#ManchuManoj) మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక (#BhumaMounica) తో కలిసి సీతాఫలమండి (#Seethaphalmandi) లో ఒక వినాయక మంటపంకి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది. అయితే అప్పట్లో వాళ్లిద్దరూ వివాహం చేసుకుంటున్నారు, మీడియాతో మాట్లాడుతారు, తేదీ ఇదిగో ఆదిగో అంటూ ఏవేవో వార్తలు చిలవలు పలవల్లా వచ్చాయి. (#ManchuManojMarriage) కానీ ఈసారి మాత్రం తేదీ ఖరారు అయినట్టుగా కనపడుతోంది. మార్చి 4వ తేదీ పెళ్లి ఫిక్స్ (#ManojMarriageFix) అయినట్టుగా సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇటు మంచు కుటుంబం (#ManchuFamily) నుండి కానీ, అటు భూమా కుటుంబం (#BhumaFamily) నుండి కానీ ఎటువంటి అధికారిక వార్తలు మాత్రం వెలువడలేదు.
వీరిద్దరి వివాహానికి మంచు వారింట్లో ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి అని మాత్రం వినపడుతోంది. సాంఘీక మాధ్యమాల్లో కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి, దానిని బట్టి మార్చి 4వ (March 4) తేదీన వివాహం జరగనుందని సమాచారం. వేదిక ఎక్కడనేది ఇంకా తెలియదు. మంచు మనోజ్ కి తన అక్క మంచు లక్ష్మి (#ManchuLakshmi)తో మంచి అనుబంధం ఉండటం వలన, పెళ్లి పనులు అన్నీ మంచి లక్ష్మి ఇంట్లో జరుగుతున్నాయని, అందులో భాగం గానే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. మహా మంత్ర యాగం కూడా జరిపించారని, ఆ పూజా కార్యక్రమం జరుగుతుండగా తీసిన ఫోటోలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పూజ కి మంచు కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం.
మంచు మనోజ్, భూమా మౌనిక లు ఎప్పుడయితే ఇద్దరూ కలిసి సీతాఫలమండి లో వున్న ఒక వినాయక మండపాన్ని సందర్శించారో ఆరోజు నుండే వీరి పెళ్లి రూమర్స్ మొదలయ్యాయి, అలాగే వాళ్లిద్దరూ మనోజ్ ఇంట్లోనే సహజీవనం (#LiveinTogether) చేస్తున్నట్లు కూడా వార్తలు బాగా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజం కాబోతూ ఉండటం విశేషం.
మంచు మనోజ్ కి ఇదివరకే 2015లో ప్రణతి రెడ్డి (#PranathiReddy) అనే అమ్మాయితో పెళ్లయింది. కానీ ఎక్కువ కాలం వాళ్లిద్దరూ కలిసి ఉండలేకపోయారు, అందుకే 2019లో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా భూమా మౌనిక కూడా తన భర్తతో విడిపోయారు. అయితే మనోజ్, మౌనిక ఇద్దరికీ చాలా చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. అప్పట్లోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ అప్పట్లో ఇరు కుటుంబాల పెద్దలు వద్దు అనుకున్నారని సమాచారం.
భూమా మౌనిక కొన్నాళ్ళు చెన్నై లో ఉండేదని, అప్పుడే మనోజ్ కూడా చెన్నై వెళ్లి ఉండేవాడని, అయితే ఇలా మౌనిక తో ఉండటం మనోజ్ కుటుంబం లో కొంతమందికి నచ్చలేదని, అందువలనే ఆ కాలం లో కుటుంబానికి దూరంగా వున్నాడని సమాచారం. ఆ తరువాత మనోజ్ కుటుంబం కూడా ఒప్పుకోవటం తో చెన్నై నుండి ఇద్దరూ హైదరాబాద్ మకాం మర్చి మనోజ్ అక్కయ్య లక్ష్మి ఇంటోలో వుంటున్నారని అనుకుంటున్నారు. ఈ పెళ్లి తంతు కూడా లక్ష్మి ఆధ్వర్యం లోనే జరుగుతోందని భోగట్టా.