Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

ABN , First Publish Date - 2023-03-03T10:22:58+05:30 IST

గత కొంతకాలంగా మంచు మనోజ్ (Manchu Manoj) వివాహం గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Manchu Manoj

గత కొంతకాలంగా మంచు మనోజ్ (Manchu Manoj) వివాహం గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ మంచు వారింట్లో పెళ్లి (Marriage) సందడి మొదలైంది. అందరూ అనుకున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika reddy)ని ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. శుక్రవారం (మార్చి 2న) ఈ జంట వివాహబంధంతో ఒకటవ్వనున్నారు. కుటుంబ సభ్యులు రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.

manoj1.jpg

హైదరాబాద్‌‌లోని ఫిల్మ్‌‌నగర్‌లోని మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట్లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుక మొత్తం ఆమె చేతుల మీదుగానే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక (Wedding Celelebration) జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మెహందీ ఫంక్షన్‌కి సంబంధించిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు లక్ష్మి తన సంతోషాన్ని పంచుకుంది. మొదటి భార్యతో విడాకుల తర్వాత చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న మనోజ్‌కి పెళ్లి జరుగుతుండడంతో మంచు కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T10:42:18+05:30 IST