Mahesh Vitta : ఐదేళ్ల ప్రేమ.. ఫలించింది.. మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు!

ABN , First Publish Date - 2023-09-05T16:08:23+05:30 IST

టాలీవుడ్‌ కమెడియన్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేష్‌ విట్టా ఓ ఇంటివాడు అయ్యాడు. శ్రావణితో మహేష్‌ విట్టా వివాహం ఘనంగా జరిగింది. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో హెల్త్‌ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహేష్‌ విట్టా కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది.

Mahesh Vitta : ఐదేళ్ల ప్రేమ.. ఫలించింది.. మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు!

టాలీవుడ్‌ కమెడియన్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేష్‌ విట్టా (Mahesh Vitta) ఓ ఇంటివాడు అయ్యాడు. శ్రావణితో (Sravani) మహేష్‌ విట్టా వివాహం ఘనంగా జరిగింది. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో హెల్త్‌ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహేష్‌ విట్టా కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. మంగళవారం మహేష్‌ విట్టా–శ్రావణిల వివాహ వేడుకకి సంబంధించిన ఫొటోలను మహేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

రాయలసీమ యాసతో యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన మహేష్‌ విట్టా.. ఫన్‌ బకెట్‌ వీడియోలతో మరింత పేరు తెచ్చుకున్నాడు. అదే క్రేజ్‌తో సినిమాల్లో అవకాశం అందుకున్నారు. బిగ్‌ బాస్‌లోకి షోకు రెండు సార్లు వెళ్లాడు. సీజన్‌ 3తో పాటు ఓటీటీ కంటెస్టెంట్‌గా కూడా హౌస్‌లో అడుగుపెట్టాడు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండగానే.. తన లవ్‌ స్టోరీ గురించి తెలిపాడు. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో పెళ్లి ఉండొచ్చని చెప్పిన మహేష్‌ విట్టా.. అన్నట్టుగానే.. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే పెళ్లి చేసుకున్నాడు. శ్రావణితో ఐదేళ్లగా ప్రేమలోఉన్నాడు మహేశ్‌. ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మహేష్‌ విట్టా చెల్లెలి ఫ్రెండే ఈ శ్రావణి రెడ్డి. తొలిచూపులోను చెల్లెలి ఫ్రెండ్‌పై మనసు పడ్డ మహేష్‌ విట్టా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు లవ్‌ ప్రోజ్‌ చేశాడు. మొదట ఆమె రిజెక్ట్‌ చేసింది. అయినా వదలకుండా లవ్‌ చేస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్‌గా ఉండటానికి అంగీకరించిన శ్రావణి రెండేళ్ల తర్వాత మహేశ్‌ ప్రేమను అంగీకరించింది. దాంతో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Vitta-mahesh.jpg

'కొండపొలం’, జాంబీ రెడ్డి, ఇందువదన, ఎ1 ఎక్స్‌ ప్రెస్‌..వంటి చిత్రాల్లో నటించాడు. పుష్ప సినిమాలో జగదీష్‌ చేసిన కేశవ పాత్ర మొదట మహేష్‌ విట్టా చేయాల్సి ఉంది. పలుమార్లు ఆడిషన్‌కి వెళ్లాడు కానీ చివరి నిమిషంలో జగదీష్‌ని తీసుకున్నారు. ప్రస్తుతం తను హీరోగా ఓ సినిమా రూపొందుతుంది.

Updated Date - 2023-09-05T16:20:14+05:30 IST