Mahesh Babu: ఆరోజు హ్యాపీగా ఉంటారని అభయమిచ్చాడు!
ABN , First Publish Date - 2023-08-21T09:52:47+05:30 IST
‘గుంటూరు కారం’ (Guntur karam) చిత్రంపై రోజుకో వార్త వినిపిస్తోంది. హీరోయిన్ పూజాహెగ్డే సినిమా నుంచి తప్పుకోవడం మొదలు ఇటీవల ఛాయగ్రాకుడి మార్పు వరకూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం మొదలై చాలాకాలం అయినా షూటింగ్ 50 శాతం కూడా పూర్తికాలేదు. ఈ తరుణంలో నిర్మాణ సంస్థ ప్రకటించినట్లు సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అన్న అనుమానం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
‘గుంటూరు కారం’ (Guntur karam) చిత్రంపై రోజుకో వార్త వినిపిస్తోంది. హీరోయిన్ పూజాహెగ్డే సినిమా నుంచి తప్పుకోవడం మొదలు ఇటీవల ఛాయగ్రాకుడి మార్పు వరకూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం మొదలై చాలాకాలం అయినా షూటింగ్ 50 శాతం కూడా పూర్తికాలేదు. ఈ తరుణంలో నిర్మాణ సంస్థ ప్రకటించినట్లు సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అన్న అనుమానం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికితోడు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదిక దర్శకనిర్మాతలను ట్రోలింగ్‌తో ఆడుకుంటున్నారు. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెట్టే బాధ్యతను సూపర్‌స్టార్ మహేశ్ (Maheshbabu) తీసుకున్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘గుంటూరు కారం’ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. కచ్చితంగా సినిమా సంక్రాంతికి విడుదలవుతుందనీ, ప్రేక్షకులంతా ఆనందంగా ఉంటారని చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై ఉన్న అనుమానాలకు తెర దించారు. మహేష్, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై స్ రాధా కృష్ణ నిర్మిస్తున్నారు.
అప్పుడు నేనే చెబుతా...
ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ పోస్ట్ చేస్తున్న వర్కవుట్ వీడియోల గురించి అడగగా.. ‘జిమ్‌లో చేసే వర్కవుట్స్ రెగ్యులర్‌గా చేసేదే. అందరూ రాజమౌళి సినిమా గురించి అనుకుంటున్నారు. రాజమౌళితో చేసే చిత్రం ఇంకా ప్రారంభం కాదు. దానికి ఇంకా సమయం పడుతోంది. ఒకవేళ ఆ సినిమా కోసం కసరత్తులు చేయడం మొదలు పెడితే నేనే ఆ విషయాన్ని స్వయంగా చెబుతాను’’ అన్నారు మహేశ్.
సగం సమాజ సేవకే...
‘బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడం వల్ల వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నాం. గౌతమ్ పుట్టినప్పటి నుంచి ఏదో విధంగా చిన్నపిల్లలకు సాయం చేయాలని అనుకున్నా. అందుకే చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా. అలాగే నా సినిమాలు రీ-రిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే వినియోగిస్తున్నాం’’ అని మహేశ్ చెప్పారు. ఫోన్ ఉపయోగం గురించి మాట్లాడిన ఆయన ‘అందరిలానే తానను స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగానే ఉపయోగిస్తానని, ఫోన్ చూసే సమయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తునట్లు చెప్పారు. ‘మీ మొబైల్ రింగ్ టోన్ ఏంటి’ అని అడుగుతున్నారు. ‘నాది సైలెంట్ టోన్’ అని నవ్వుతూ చెప్పారు.