Maa Oori Polimera: మరిన్ని ట్విస్ట్‌లతో సీక్వెల్

ABN , First Publish Date - 2023-02-18T18:47:32+05:30 IST

‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera).. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం. సినిమా ఎండింగ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో.. ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడెప్పుడు

Maa Oori Polimera: మరిన్ని ట్విస్ట్‌లతో సీక్వెల్
Maa Oori Polimera Movie Still

‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera).. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం. సినిమా ఎండింగ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో.. ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అనేలా చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కి (Sequel to Maa Oori Polimera) సంబంధించి షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ తెలియజేశారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ (Shree Krishna Creations) బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ (Gowri Kriesna) ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు (Dr. Anil Vishwanath). స‌త్యం రాజేష్ (Satyam Rajesh)‌, డా. కామాక్షి భాస్కర్ల (Dr. Kamakshi Bhaskarla), గెట‌ప్ శ్రీను (Get-up Srinu), బాలాదిత్య (Baladitya), ర‌వి వ‌ర్మ (Ravi Varma)‌, చిత్రం శ్రీను (Chitram Sreenu), అక్షత శ్రీనివాస్‌ (Akshata Srinivas) ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Gowri.jpg

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో ప్రేక్షకులు ఊహించని మరిన్ని ట్విస్ట్‌లుంటాయి. ఖచ్చితంగా ప్రేక్షకులని ఈ చిత్రం మరింతగా ఆకర్షిస్తుంది.

satyam-2.jpg

త్వ‌ర‌లోని చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలను వెల్ల‌డించ‌నున్నామని తెలిపారు. కాగా.. బాణామతి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి గ్యాని సంగీతమందిస్తున్నారు. (Maa Oori Polimera Sequel Update)

Updated Date - 2023-02-18T18:51:10+05:30 IST