Bro: చివరి 20 నిముషాలు భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయట

ABN , First Publish Date - 2023-07-24T12:42:31+05:30 IST

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా ఈనెల 28న విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమాలో చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాల్ని కదిలించివేస్తాయి అని అంటున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు.

Bro: చివరి 20 నిముషాలు భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయట
Pawan Kalyan and Sai Dharam Tej from Bro

పవన్ కళ్యాణ్ (PawanKalyan), అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'బ్రో' #BroTrailer ట్రైలర్ విడుదలైంది. సినిమాకి అంతవరకూ ఎటువంటి బజ్ లేదన్నవారే ట్రైలర్ చూసాక అదిరింది అని అంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడుగా కనిపించనున్నాడు. సముద్రఖని (Samuthirakani) దీనికి దర్శకుడు కాగా, పీపుల్స్ మీడియా ఫెక్టరీ (PeoplesMediaFactory) సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేతిక శర్మ (KetikaSharma), ప్రియా వారియర్ (PriyaPrakashVarrier) ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.

ఇది తమిళ సినిమా 'వినోదయ సితం' #VinodhayaSitham అనే సినిమాకి రీమేక్. అయితే మాతృక నుండి కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని, తెలుగులో చాలా మార్పులు చేసినట్టుగా చెపుతున్నారు. ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) అందిస్తున్నారు.

Bro-3.jpg

ఈ సినిమా ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్నేహితులు కొంతమంది చూసినట్టుగా చెపుతున్నారు. అయితే ఈ చూసినవాళ్లు చెప్పేదాన్ని బట్టి చివరి 20 నిముషాలు సినిమా ఎక్కడికో తీసుకెళుతుందని, ప్రేక్షకులు బయటకి చాలా బరువెక్కిన హృదయంతో వస్తారని, ఎందుకంటే క్లైమాక్స్ లో భావోద్వేగాలు అంతగా వుంటాయని చెపుతున్నారు. చివరి 20 నిముషాలు కేవలం మాటలు ద్వారానే సన్నివేశాలు సాగుతూ ఉంటుందని, ఆ మాటలతో పాటు సాయి ధరమ్ తేజ్ అభినయం అందరినీ అలరిస్తుందని, అది చాలా భావోద్వేగంగా చేసాడని అంటున్నారు.

అందుకనే ఈ సినిమాకి చివరి 20 నిముషాలు మాత్రం ఆయువుపట్టు లాంటిదని చెపుతున్నారు. అయితే సినిమా అంతా కూడా చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని, పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అతని అభిమానులు అనుకుంటున్నారో అలానే ఈ సినిమాలో కనపడనున్నాడని చెపుతున్నారు. సినిమా అంతా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ని రాగింగ్ గా లా చేస్తూ ఉంటాడని ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అలరిస్తాయని అంటున్నారు. ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది.

Updated Date - 2023-07-24T12:42:31+05:30 IST