K.Vishwanath: ఆ ఐదు చాలా కీలకం!

ABN , First Publish Date - 2023-02-03T16:00:26+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు విలువిస్తూ కళా తపస్వీ కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఏ స్థాయికి తీసుకెళ్లాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదిలే అపురూప పాత్రలు, లోతైన మాటలు, వినసొంపైన సంగీతం-పాటలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి.

K.Vishwanath: ఆ ఐదు చాలా కీలకం!

సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు విలువిస్తూ కళా తపస్వీ కె. విశ్వనాథ్‌ (Vishwanath) తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఏ స్థాయికి తీసుకెళ్లాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదిలే అపురూప పాత్రలు, లోతైన మాటలు, వినసొంపైన సంగీతం-పాటలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. కళలకు జీవం పోస్తూ ఆయన తీసిన చిత్రాలు అజరామరం అనే చెప్పాలి. ఆయన రచన, దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం(sankarabharanam)’, ‘స్వాతిముత్యం’(swathimuthyam), ‘సూత్రధారులు’, (suthradarulu( ‘సప్తపది’(saptapadi), ‘స్వరాభిషేకం(swarabhishekam)’.. ఈ ఐదు చిత్రాలు అన్ని చోట్ల చక్కని ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు జాతీయ పురస్కారాలను అందుకున్నాయి. దాని వెనకున్న కథేంటో చూద్దాం..

Sankarabharanam.jpg

శంకరాభరణం... (sanakarabharanam)

స్టార్‌ హీరో, స్టార్‌ హీరోయిన్‌, గ్లామర్‌, కమర్షియల్‌ హంగులు ఇవేమీ లేకుండా కేవలం సంగీతం ప్రధానంగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం ‘శంకరాభరణం’. ఓ వయసు మళ్లిన సంగీత కళాకారుడికి, ఓ నృత్య కళాకారిణికి మధ్య ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ ఇది. జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో స్టార్లు లేరు, గ్లామర్‌ లేదు.. ఫైట్‌లకు ఆస్కారమే లేదు. మరి ఈ చిత్రంలో ఏముందని అంతగా ప్రేక్షకుల్ని అలరించింది? కథతోపాటు కట్టిపడేసే కథనం, వెస్ట్రన్‌ మ్యూజిక్‌ తాకిడికి రెపరెపలాడిపోతున్న సంపద్రాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే దృశ్య పరంపర ఇందులో ఉంది. ఇందులో పాటలు, మాటలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ చిత్రాన్ని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. నాలుగు జాతీయ అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో స్వర్ణ కమలం.. రూ.2 లక్షల నగదును నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్‌ రజత కమలం.. రూ.50 వేలు, ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రజత కమలం.. రూ.50 వేలు, ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్‌ రజత కమలం.. రూ.50 వేలు అందుకున్నారు.

Saptapadi.jpgసప్తపది(saptapadi)

సమాజంలో మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని చాటి చెప్పిన చిత్రం ‘సప్తపది’ . జె.వి.సోమయాజులు, సబితా భమిడిపాటి, రవిశంకర్‌, అల్లు రామలింగయ్య కీలక పాత్రధారులుగా కె.విశ్వనాథ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివాహం నేపథ్యంలో సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది. 1981లో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘నర్గీస్‌దత్త్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌’ కేటగిరీలో రజత కమలం.. రూ.50 వేలు) అవార్డు వరించింది.

2.jpg

స్వాతిముత్యం.. (swathi muthyam)

1983లో కె.విశ్వనాథ్‌ నుంచి వచ్చిన మరో అపురూప చిత్రం ‘స్వాతిముత్యం’. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్ర్తీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన తీసుకొచ్చిన చిత్రమిది. కమల్‌హాసన్‌లోని (Kamal haasan)నటనకు అద్దం పట్టిన మరపురాని చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అమాయకుడిగా కమల్‌హాసన్‌, భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా (రజత కమలం రూ.50 వేలు నగదు) జాతీయ అవార్డు అందుకుంది.

suthradarulu.jpg

సూత్రధారులు (suthradarulu)

అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని చాటి చెప్పిన చిత్రం ‘సూత్రధారులు’జ అక్కినేని నాగేశ్వరరావు(ANR), మురళీమోహన్‌, భానుచందర్‌, రమ్యకృష్ణ, సత్యనారాయణ నటించిన ఈ సినిమా 1989లో విడుదలై.. చక్కని విజయాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.

swarabi.jpg

స్వరాభిషేకం (Swarabhishekam)

సమాజం పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్న సమయం, కమర్షియల్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సంగీత ప్రధానంగా రూపొందిన చిత్రం ‘స్వరాభిషేకం’. సంగీత ద్వయంగా విశ్వనాథ్‌, శ్రీకాంత్‌ నటించి మెప్పించారు. లయ కీలక పాత్ర పోషించారు. 2004లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్లింది. తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగీరిలో జాతీయ అవార్డు అందుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు.

Updated Date - 2023-02-03T16:00:30+05:30 IST