Vijay Devarakonda: ఖుషి పూర్తయింది!

ABN , First Publish Date - 2023-07-15T19:47:35+05:30 IST

విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైతీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ చేయబోతోన్నారు. ఇప్పటికే హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందించిన రెండు పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Vijay Devarakonda: ఖుషి పూర్తయింది!

విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైతీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ చేయబోతోన్నారు. ఇప్పటికే హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందించిన రెండు పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. శనివారం చిత్ర బృందం చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చాయి. ఈ మేరకు టీమ్‌ అంతా కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఖుషి సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు స్వింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబర్‌ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషల్లో సినిమాను గ్రాండ్‌ విడుదల చేస్తున్నాం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-07-15T19:47:35+05:30 IST