Kushboo Sundar: ‘దానికి సిగ్గు పడట్లేదు.. అందరూ అలాగే ఉండాలి..’
ABN , First Publish Date - 2023-03-08T12:59:27+05:30 IST
తన కన్నతండ్రే తనను లైంగిక వేధింపులకి గురి చేసినట్లు సినీ నటి, జాతీయ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) షాకింగ్ విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
తన కన్నతండ్రే తనను లైంగిక వేధింపులకి గురి చేసినట్లు సినీ నటి, జాతీయ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) షాకింగ్ విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై తాజాగా నటి స్పందించారు. ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా మాట్లాడినందుకు ఏమాత్రం సిగ్గు పడట్లేదని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారు. (Child Abusing)
ఖుష్బూ మాట్లాడుతూ.. ‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా అందరికీ తెలియజేశా అంతే. అందులో ఆశ్చర్యపోవడానికి కాని, సిగ్గుపడటానికి ఏమి లేదు. నాపై ఇలాంటి దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తి సిగ్గుపడాలి. బాధపడాలి. ఇలాంటి దారుణాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి. మిమ్మల్ని కించపరిచే విధంగా ఉన్న వేటిని కూడా ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో పంచుకోడానికి కాస్తా సమయం తీసుకొన్నాను. అయినా అందరితో షేర్ చేసుకున్నాను. అలాగే ప్రతి మహిళ తనకు ఎదురైన ఇలాంటి వేధింపుల గురించి బయటి ప్రపంచానికి తెలిపి.. ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. (Kushboo Sundar)
కాగా.. ఇటీవలే జార్ఖండ్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఖుష్బూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళ శక్తి గురించి మాట్లాడుతూ ఎనిమిదేళ్ల వయసులో తన త్రండే లైంగిక వేధింపులకి గురి చేయడం గురించి వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. ‘భార్యపిల్లలని కొట్టడం, చిత్రహిసలు పెట్టడం జన్మ హక్కుగా భావించే వ్యక్తి నా కన్నతండ్రి. అతని వల్ల నా తల్లి చాలా బాధలు పడింది. అంతేకాకుండా.. నా ఎనిమిదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు నన్ను లైంగికంగా వేధించాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (Kushboo Sundar)
ఇవి కూడా చదవండి:
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?
Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు