Dil Raju: కృష్ణగాడు రేంజ్‌కి దిల్ రాజు సపోర్ట్
ABN , First Publish Date - 2023-07-26T20:21:49+05:30 IST
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ (Krishna Gadu Ante Oka Range). శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించి.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుతూ.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
ఓ అందమైన పల్లెటూరు. అందులో కృష్ణ అనే చలాకీ కుర్రాడు. పుట్టినప్పటి నుంచి అతనికి తన ఊరితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఆ ఊరే కృష్ణ ప్రపంచం. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయిని వస్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. తండ్రి కోరికను కృష్ణ ఎలా నేరవేర్చాడు? కృష్ణ అనుకున్న పని సాధించాడా? తన ప్రేమను గెలుచుకున్నాడా? కృష్ణ జీవితంలో తన ఊరితో ఉండే అనుబంధం ఎలాంటిది? అనేది హిలేరియస్‌గా ఎంటర్‌టైనర్ చేస్తూ.. ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. (Krishna Gadu Ante Oka Range Story)
ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, మూడు సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. కొత్త హీరో హీరోయిన్లు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఓ వైపు యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నట్లుగా తెలుస్తోంది. ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన ఈ కృష్ణ గాడి రేంజ్ ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. (Krishna Gadu Ante Oka Range Release Date)
ఇవి కూడా చదవండి:
**************************************
*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది
**************************************
*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..
**************************************
*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..
**************************************
*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?
**************************************
*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్
**************************************