Krishna Gadu Ante Oka Range: కృష్ణగాడు తన రేంజ్ చూపించేది ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-07-12T17:59:16+05:30 IST
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఓ డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీగా.. సరికొత్త కథ, కథనంతో నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను రాజేష్ దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 4న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

రిష్వి తిమ్మరాజు (Rishvi Thimmaraju), విస్మయ శ్రీ (Vismaya Sri) హీరోహీరోయిన్లుగా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ (Krishna Gadu Ante Oka Range) అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఓ డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీగా.. సరికొత్త కథ, కథనంతో నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి (Rajesh Dondapati) ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, రెండు సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. త్వరలో రాబోయే ప్రమోషనల్ కంటెంట్ మరింతగా ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కొత్త హీరోహీరోయిన్లను పరిచయమవుతున్న ఈ చిత్రం యూత్ ఆడియన్స్ మెప్పు పొందుతుందని వారంతా నమ్మకంగా ఉన్నారు. (Krishna Gadu Ante Oka Range Release Date)
రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తున్నామని.. పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ యువ హృదయాల మనసు దోచేలా ఈ మూవీలోని సన్నివేశాలు ఉంటాయని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ ఈ సినిమాలో హైలైట్ అవుతాయని.. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ మా కృష్ణ గాడు తన రేంజ్ చూపించడానికి రెడీగా ఉన్నాడని.. ప్రేక్షకులు కూడా థియేటర్లలో వాడి రేంజ్ చూడటానికి సిద్ధమవ్వండని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..
**************************************
*Mahaveerudu: ‘మహావీరుడు’కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
**************************************
*Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది
**************************************
*Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
**************************************