SuperStarKrishna: నరేష్, మహేష్ మీద సీనియర్ ఫాన్స్ సీరియస్

ABN , First Publish Date - 2023-01-09T18:21:16+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, కానీ అయన కుటుంబ సభ్యులు తీరు చూస్తుంటే, కృష్ణ గారి అభిమానులకు, ముఖ్యంగా సీనియర్ అభిమానులకు గుండె తరుక్కుపోతోంది..

SuperStarKrishna: నరేష్, మహేష్ మీద సీనియర్ ఫాన్స్ సీరియస్

సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు, కానీ అయన కుటుంబ సభ్యులు తీరు చూస్తుంటే, కృష్ణ గారి అభిమానులకు, ముఖ్యంగా సీనియర్ అభిమానులకు గుండె తరుక్కుపోతోంది. (Senior fans of Krishna is serious on Naresh and Mahesh about their manner) నరేష్, మహేష్ ఎందుకు ఇలా చేసారు అని వాళ్ళందరూ వాళ్ళ గ్రూప్ లో చర్చ మొదలెట్టారు. లాభం లేదు, మనం ఇంక సైలెంట్ అయిపోదాం, ఇక్కడితో ఆపేద్దాం, ఇంకా ఎవరికీ అభిమానులుగా వద్దు అన్న నిర్ణయానికి వచ్చారు అంటే, ఆ అభిమానులు ఎంత బాధపడ్డారో అర్థం అవుతుంది. నిజంగా ఇది మహేష్ బాబు కి ఒక నెగటివ్ అవుతుందేమో, ఎందుకంటే ముందు ముందు సీనియర్ అభిమానులు ఇంతకు ముందులా మహేష్ బాబు సినిమాలు చూడకపోవచ్చు. (Senior fans are very upset the way Mahesh family treated Krishna garu after his death)

mb-fm2.jpg

ఇంతకీ ఇదంతా ఎందుకు, ఏమి జరిగింది అని ఆరా తీస్తే, ఇందులో నరేష్, కృష్ణ గారి కుటుంబ సభ్యుల ప్రవర్తన కృష్ణగారి చనిపోయిన రోజునాడు బాగోలేదు అని తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న చనిపోయారు, అయితే నరేష్ డిసెంబర్ 1 వ తేదీన ఒక వీడియో విడుదల చేసాడు. అందులో తాను పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు, త్వరలో తేదీ ప్రకటిస్తా అని, ఒక గాఢ చుంబనం తో చెప్పారు. (Naresh releases a video that he is going to marry Pavitra and will announce the date soon. He said it with a lip-lock kiss) ఇది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) కి నచ్చలేదు. ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ అందులో కృష్ణ గారు చనిపోయిన రోజు ఆయన్ని అనాధలా వదిలేసి, కుటుంబ సభ్యులు, నరేష్ అందరూ ఎలా వెళ్ళిపోయి పడుకున్నారు అన్నది చూపించింది. (She come up with videos on the night of Krishna's death where all the family members left that night and left Krishna garu alone)

krishna-mahesh1.jpg

రాత్రి 10.30 గంటల నుండి ఎవరికీ వారు కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఆలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. నరేష్ ఇంట్లోనే కృష్ణ గారి పార్థివ దేహం వున్నా, అతను కూడా హాయిగా పడుకున్నాడు. అస్సలు ఆరోజు నరేష్ ప్రవర్తన కూడా చాలామంది అభిమానులకి, పరిశ్రమలో వారికీ చాలా చిరాకు తెప్పించిందని చెప్పుకున్నారు అందరూ. అటు నరేష్ చూడలేదు, ఇటు మహేష్ గానీ, అతని అక్కాచెల్లెళ్లు గానీ, లేక ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కానీ కృష్ణ గారి దగ్గర లేకపోవటం ఆలా ఒంటరిగా వదిలేయటం చూసిన అభిమానులు గుండె తరుక్కుపోయింది. మా హీరో ని ఇలా వదిలేసారు ఏంటి, మాకు చూపించినా మేము అంతా రాత్రి చూసుకుంటూ మా హీరో కి మేమున్నాం అని చెప్పుకునేవాళ్ళం అని అంటున్నారు.

naresh-pavitra.jpg

అసలు నరేష్ ఎందుకు ఆ వీడియో పెట్టాలి, అంత ఎమర్జెన్సీ ఏంటి? కృష్ణ గారితో ఎందుకు రమ్య రఘుపతి మీద నరేష్ ఫిర్యాదు చేయించాడు? ఆయన్ని ఇందులోకి ఎందుకు లాగాడు, దీనివల్లే కదా ఇవన్నీ బయటకి వచ్చాయి అని నరేష్ మీద కృష్ణ గారి అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, మహేష్ కుటుంబం వెకేషన్ కి వెళ్లారు, అంతవరకూ బాగుంది, కానీ సాంఘీక మాధ్యమాల్లో ఆడుతూ పాడుతూ హాయిగా తింటూ వున్న ఆ ఫోటోస్ ఎందుకు పెట్టడం అని అభిమానులు గుర్రుమంటున్నారు. కృష్ణగారి అభిమానులే ఇంతవరకు కృష్ణ గారి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు, అటువంటిది మహేష్ కుటుంబం ఆలా ఎలా ఎంజాయ్ చేస్తారు. ఒక కుటుంబ సభ్యుడు, అదీ కాకుండా ఒక సూపర్ స్టార్ తమ ఇంట్లోంచి పోతే, కనీసంలో కనీసం సైలెంట్ గా ఉండలేరా,అంతలా ఫోటోస్ పెట్టాలా అని అభిమానులు మహేష్ బాబు మీద కినుక వహించారు. దీని వలన సీనియర్ అభిమానులు కొంతమంది సైలెంట్ అయిపోవచ్చు అని తెలిసింది. వాళ్ళు కృష్ణ గారు పోయాక, ఆ కుటుంబం అతనికి ఎటువంటి గౌరవం ఇచ్చిందో వీడియోస్ ద్వారా తెలిసింది, ఇంక ఇక్కడితో ఆపేద్దాం అని అనుకుంటున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-01-09T18:38:24+05:30 IST