సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Upasana: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కియారా.. క్షమాపణలు చెప్పిన ఉపాసన

ABN, First Publish Date - 2023-02-08T12:30:53+05:30

బాలీవుడ్ లవ్‌ బర్డ్స్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

Upasana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ లవ్‌ బర్డ్స్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సూర్యగర్ ప్యాలెస్‌లో ఈ జంట వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి ఎంతోమంది బాలీవుడ్, ఇతర పరిశ్రమ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే చాలామందిని ఈ జంట వివాహానికి ఆహ్వానించారు. అందులో రామ్‌చరణ్ (Ram charan), ఉపాసన (Upasana) దంపతులు కూడా ఉన్నారు. కానీ వివిధ కారణాల వల్ల వారు ఈ పెళ్లికి వెళ్లలేకపోయారు.

ఈ తరుణంలోనే వివాహానంతరం తమ పెళ్లి ఫొటోలను కియారా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పోస్ట్‌పై ఎంతోమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అందులో సమంత, కత్రినాకైఫ్, ఆలియా భట్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, ఆతియా శెట్టి వంటి పలువురు ఉన్నారు. ఈ పోస్ట్‌పై టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కూడా స్పందించారు.

‘అభినందనలు. మీరు చాలా అందంగా ఉన్నారు. మేము పెళ్లికి రాలేకపోయినందుకు క్షమించండి’ అని ఆ కామెంట్‌లో ఉపాసన రాసుకొచ్చారు. కాగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామా’ మూవీలో రామ్‌చరణ్, కియారా జంటగా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉపాసన, కియారా మధ్య మంచి స్నేహం ఉంది. కాగా.. శంకర్, రామ్‌చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 15’లోనూ కియారానే హీరోయిన్.

Updated Date - 2023-02-08T12:30:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!