Rules Ranjann: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల సినిమా విడుదల వాయిదా
ABN , First Publish Date - 2023-09-12T10:59:08+05:30 IST
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న 'రూల్స్ రంజన్' కొత్త విడుదల తేదీని ఆ చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఇంతకు ముందు ప్రకారం అయితే ఈ సినిమా ఈనెల 28న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు ఎప్పుడు విడుదలవుతోంది అంటే...
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AMRatnam) సమర్పణలో వస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్' #RulesRanjann, ఇందులో కిరణ్ అబ్బవరం, (KiranAbbavaram) నేహా శెట్టి (NehaShetty) జంటగా నటిస్తుండగా, రత్నం కృష్ణ (RathinamKrishna) దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ గణేష్ (AmreshGanesh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోంచి 'సమ్మోహనుడా...' అనే పాట ఇప్పటికే చాలా వైరల్ అయింది, చాలామంది ఈ పాటని రీల్స్ కూడా చేసి అభినయిస్తున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 28న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు చిత్ర నిర్వాహకులు కొత్త తేదీని ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్ కూడా ఈమధ్యనే విడుదలైంది, ఇది ఒక వినోదం తో కూడిన సినిమాగా వస్తోందని అర్థం అయింది. ఇప్పుడు కొత్త తేదీ ప్రకారం ఈ చిత్రం ను అక్టోబర్ 6 (October6) న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా నిర్మాతలు తెలిపారు . ఈ మేరకు ఒక ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ నెల 28న రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' #Skanda విడుదలవుతోంది, అలాగే శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) దర్శకత్వంలో వస్తున్న 'పెదకాపు 1' #PeddhaKapu1 కూడా ఈనెల 29న వస్తోంది. రాఘవ లారెన్స్ (RaghavaLawrence), కంగనా రనౌత్ (KanganaRanaut) లు నటిస్తున్న పి వాసు (PVasu) దర్శకత్వంలో వస్తున్న 'చంద్రముఖి 2' #Chandramukhi2 కూడా 28నే విడుదలవుతోంది. ఇంకో రెండు చిన్న సినిమాలు కూడా వున్నాయి, ఇలా చాలా సినిమాలు ఉండటంతో 'రూల్స్ రంజాన్' నిర్వాహకులు అక్టోబర్ 6 సరైన తేదీగా నిర్ణయించుకొని అప్పుడు విడుదల చేస్తున్నారని తెలిసింది.