Keethi Suresh: ఆ ప్రశ్న అడిగినందుకు.. అసహనం..
ABN , First Publish Date - 2023-06-04T15:54:52+05:30 IST
కీర్తి సురేశ్.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందులో ఒక కారణం.. ఆమె పెళ్లి గురించి వార్తలు వైరల్ కావడం, రెండోది గ్లామర్‌డోస్ పెంచి హాట్‌హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం. అయితే పెళ్లి విషయంపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.
కీర్తి సురేశ్ (Keerthi suresh) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందులో ఒక కారణం.. ఆమె పెళ్లి గురించి వార్తలు వైరల్ కావడం, రెండోది గ్లామర్‌డోస్ పెంచి హాట్‌హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం. అయితే పెళ్లి విషయంపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఓ సందర్భంలో ఆమె తల్లి కూడా స్పందించారు. ఎవరినైనా లవ్ చేసినా, పెళ్లి కుదిరినా.. అందరికీ చెప్పే చేసుకుంటా’ అని ఈ మధ్యన రెండు, మూడు సార్లు కీర్తి వెల్లడించారు. తాజాగా కీర్తి తండ్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. కీర్తి తండ్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్ క్రియేట్ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది’’ అని చెప్పిన సంగతి తెలిసిందే! అయినా ఈ వార్తలు ఆగడం లేదు. (Fire on marriage questions)
తాజాగా తమిళంలో కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘మామన్నన్’ ఆడియో ఫంక్షన్ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో కీర్తి మాట్లాడుతుండగా కొందరు.. ‘త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారట నిజమేనా.. అంటూ వరుస ప్రశ్నలు సంధించడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే నా పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. అయినా పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. నా వ్యక్తిగత విషయంలో మీకెందుకు అంత ఆసక్తి? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాని గురించి ఇలా సినిమాకు సంబంధించి జరిగే ప్రెస్‌మీట్స్‌లో ప్రతిసారి అడగొద్దు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఇలాంటి వేదికలపై సినిమాకు సంబంధించి అడగండి’’ అని చెప్పింది కీర్తి సురేశ్. తాజాగా కీర్తి ఇచ్చిన సమాధానంతో అయిన ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి.
‘దసరా’తో హిట్ అందుకున్న కీర్తి సురేశ్ తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలో చిరుకి చెల్లెలిగా నటిస్తున్నారు. మెహర్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకుడు.