Keeravani- Chandrabose: ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఆస్కార్‌ వరకూ!

ABN , First Publish Date - 2023-03-13T12:21:36+05:30 IST

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో’..

Keeravani- Chandrabose: ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఆస్కార్‌ వరకూ!

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము

చదువులమ్మ చెట్టు నీడలో’.. (Ekkado putti Ekkado perigi)

ప్రతి స్కూల్‌ ఫేర్‌వెల్‌డే ఫంక్షన్‌లోనూ వినిపించే పాట ఇది. ‘స్టూడెంట్‌ నంబర్‌వన్‌’ చిత్రం కోసం కీరవాణి బాణీ కట్టగా చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

ఇప్పుడు ఇదే పాటను గుర్తు చేసుకుంటున్నారు కీరవాణి... గేయ రచయిత చంద్రబోస్‌. (Chandrabose -Keeravani)

ఇద్దరు ప్రాంతాలు వేరు... ఇద్దరి నేపథ్యం వేరు. కీరవాణి పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో. చంద్రబోస్‌ది వరంగల్‌లోని చల్లగరిగ గ్రామం. సినిమా వీరిద్దరినీ కలిపింది. 1997లో వచ్చిన ‘పెళ్లి సందడి’ చిత్రంతో వీరిద్దరి కలయిక కుదిరింది. అందులో ‘సరిగమపదనిస రాగం’ పాటకు సాహిత్యం అందించారు బోస్‌. అక్కడి నుంచి వీరిద్దరి కాంబోలో ఎన్నో అద్భుతమైన పాటలొచ్చాయి ప్రేక్షకుల్ని అలరించాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘నాటు నాటు’ (natu natu) పాట కోసం సాహిత్యపరంగా, సంగీతం పరంగా వీరిద్దరూ చేసిన కృషి ఆస్కార్‌ వేదికపై ఉండేలా చేసింది. వేదికపై ‘నాటు నాటు’ పాటకు అవార్డు ప్రకటించగానే కీరవాణి, చంద్రబోస్‌ ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. పురస్కారం అందుకోగానే అభివాదం చేశారు. కీరవాణి మాట్లాడుతుండగా చంద్రబోస్‌ వేదికపై ఎంతో ఆనందంగా కనిపించారు. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... ఈ వేదికపైకి వచ్చాం’ అన్నట్లు ఆస్కార్‌ అవార్డు తనివితీరా చూస్తు ఉండిపోయారు. (RRR wins oscar)

అవార్డ్‌ అందుకున్న అనంతరం కీరవాణి మాట్లాడుతూ ‘‘నేను కార్పెంటర్స్‌ (అమెరికన్‌ వోకల్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ టీమ్‌ -కరెన్‌ కార్పెంటర్‌ (The Carpenters) - రిచర్డ్‌ కార్పెంటర్‌) వోకల్స్‌ వింటూ పెరిగాను. నేను ఈరోజు ఆస్కార్‌ వేదిక మీదున్నాను’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు, నా కుటుంబ సభ్యులకు మైండ్‌లో ఒకటే ఆలోచన ఉండేది.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ విజేతగా నిలుస్తుందనీ, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుందనీ నన్ను ప్రపంచంలో మంచి స్థానంలో నిలబెడుతుందని అర్థం వచ్చేలా వేదికపై ఇంగ్లిష్‌లో ఓ పాట పాడారు. అకాడమీకి కృతజ్ఞతలు చెప్పారు.

2.jpg1.jpg

Updated Date - 2023-03-13T13:04:57+05:30 IST