SS Rajamouli: భుజాన మరో బరువు.. ఇకపై ఎలక్షన్ ఐకాన్‌గా?
ABN , First Publish Date - 2023-03-10T13:27:27+05:30 IST
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ సెలబ్రిటీలను ప్రచార కర్తలుగా నియమంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల కోసం రాయచూర్ జిల్లాకి దర్శక ధీరుడు, స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ప్రచార కర్తగా నియమితులయ్యారు.
నిజానికి.. రాయచూర్‌లోని మానవి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులో రాజమౌళి జన్మించారు. అందుకే ఆయన ప్రచారం చేస్తే ఓటింగ్ గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భావించినట్లు, అందుకే ఎలక్షన్ కమిషన్‌కి రాజమౌళి పేరు ప్రతిపాదించినట్లు రాయచూరు కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఆ ప్రతిపాదనను కర్ణాటక ఎలక్షన్ కమిషన్ (Karnataka State Election Commission) ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. దీనికి రాజమౌళి కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష ప్రచారం, వీడియో సందేశాలు పంపడం ద్వారా ప్రజల్లో ఓటింగ్ పట్ల అవగాహన పెంచడం ఎలక్షన్ ఐకాన్ ప్రధాన కర్తవ్యం. ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అయితే.. ఆ వీడియోలలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేలా సందేశాలు ఉండవని కలెక్టర్ తెలిపారు. కాగా.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళికి ఇది గొప్ప గౌరవమనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?
Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు