Karate Kalyani: సస్పెండ్ చేయడం బాధగా ఉంది!
ABN , First Publish Date - 2023-05-26T17:35:20+05:30 IST
సినీ నటి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యురాలు కరాటే కళ్యాణిని (Karate kalyani) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు.
సినీ నటి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యురాలు కరాటే కళ్యాణిని (Karate kalyani) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. ‘ఆయనకంటూ ఓ రూపం ఉంది. ఆ రూపంలోనే ఆయన్ను చూసుకుందాం’ అంటూ ఆమె కామెంట్ చేసిన నేపథ్యంలో ‘మా’ కరాటే కల్యాణిని సస్పెండ్ చేసింది. ‘మా’ అలా చేయడం చాలా బాధగా ఉందని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ అసోసియేషన్‌పై బురద జల్లే ప్రయత్నం ఎవరు చేసినా పోరాటం చేశానని, ఎంతోమందితో తిట్లు తిన్నాని, కొందరి ముందు నెగటివ్ అయ్యానని అన్నారు. తన నిజాయతీకి ఇచ్చిన బహుమతి ఇది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. (Movie artists association)
‘‘ఓ మంచి కారణం కోసం పోరాటం చేస్తున్నా. అక్కడ ఎన్టీఆర్‌గారే (NTR statue) కాదు, ఎవరున్నా అభ్యంతరం చెబుతా. ఎన్టీఆర్ నటనకు నేనూ అభిమానినే. ఆయన రూపంలో ఎన్నో చోట్ల చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ రూపంలోనే విగ్రహం పెడదాం. ఇందుకోసం న్యాయపరంగా ముందుకెళ్తే కోర్టు రెండుసార్లు స్టే పొడిగించింది. వాళ్లు పిటిషన్ దాఖలు చేేస్త మార్పులు, చేర్పులు చేయడానికి వీల్లేదని చెప్పింది. ఈ వ్యవహారంతో ‘మా’ అసోసియేషన్‌కు సంబంధం లేదు. ఒక సీనియర్ నటుడిపై వ్యాఖ్యలు చేశానని ఆరోపిస్తూ నోటీసులు పంపారు. ఆరోగ్యం బాగోలేక సమయానికి స్పందించలేకపోయా. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ‘మా’ సూచించింది. వారం గడువు ఇవ్వమని కోరుతూ రిప్లై నోటీసు కూడా ఇచ్చా. అసోసియేషన్‌లో ఎలా భావించారో తెలియదు. నన్ను సస్పెండ్ చేస్తూ లేఖ పంపారు. ఎవరిపైనా నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్ అంతా ఒక్కటే అనుకుంటా. నేను ఎవర్నీ కించపరచలేదు. ఏ తప్పూ చేయలేదు. ‘మా’ తీసుకున్న నిర్ణయం బాధాకరం. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు’’ అని కరాటే కళ్యాణి వాపోయారు.