Karate Kalyani: మళ్ళీ వార్తల్లో కరాటే కళ్యాణి, ఈసారి ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-06-14T10:18:50+05:30 IST

కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి తన పాత ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో సాంఘీక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Karate Kalyani: మళ్ళీ వార్తల్లో కరాటే కళ్యాణి, ఈసారి ఎందుకంటే...
Karate Kalyani

సినీ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) మళ్ళీ వార్తల్లో వున్నారు. ఆమధ్య కృష్ణుడు రూపంలో వున్న ఎన్టీఆర్ (NTR) విగ్రహం ఖమ్మంలో పెట్టరాదని, ఎన్టీఆర్ మామూలుగా #NTRStatue వున్న విగ్రహాన్ని పెట్టుకోవాలని కోర్టుకు వెళ్లి ఆ విగ్రహావిష్కరణ ఆపుచేయించారు కళ్యాణి. ఆ తరువాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుండి (మా) (MovieArtisteAssociation) ఆమెని సస్పెండ్ చేస్తున్నట్టుగా మా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ఎన్టీఆర్ #NTRStatue విగ్రహం కృష్ణుడి రూపంలో పెట్టకూడదు అనే విషయంలో కళ్యాణి బాగా పాపులర్ అయిన మాట వాస్తవం. అయితే అప్పుడు చాలామంది ఆమెని వ్యతిరేకించారు, కానీ ఆమె న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పి చేస్తున్నారు.

karate-kalyani.gif

ఇప్పుడు ఆమె ఇంకోసారి వార్తల్లో వున్నారు. ఈసారి ఆమె సెమి న్యూడ్ ఫొటోస్ వైరల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కల్యాణి పిర్యాదు చేశారు. తనవి పాత ఫోటోలు, పాత సినిమా సన్నివేశాల ఫోటోలు ఇప్పుడు బయటకి తీసి వాటిని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు 469,506,509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారని తెలిసింది. ఇలా వైరల్ చేస్తున్న చేస్తున్న లలిత్ కుమార్ టీం మీద పోలీసులు కేసులు పెట్టినట్టుగా కూడా తెలిసింది.

అలాగే తనమీద తప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు భంగం కల్పిస్తున్నారంటూ కూడా పిర్యాదు చేశారు. ఇందులో లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు,రాం బాబు, నితీష్ గుప్తా, నర్సింహ గౌడ్ లపై కేసులు పెట్టారని తెలిసింది. తన

ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న లలిత్ కుమార్ టీం అని కళ్యాణి ఆరోపిస్తోంది.

Updated Date - 2023-06-14T10:18:50+05:30 IST