Kantara: మంగళవారం, కాంతారా లెవెల్లో ఉంటుందా? ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-06-14T17:50:25+05:30 IST

గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమా 'మంగళవారం'. ఇది ఒక హారర్ సినిమా అని, ఇది ఒక వైవిధ్యమైన కథతో కూడుకున్న సినిమా అని తెలుస్తోంది. అయితే ఇది ఎందుకు 'కాంతారా' లెవెల్లో వుండబోతోందా అని ఎందుకు అన్నామో చూడండి

Kantara: మంగళవారం, కాంతారా లెవెల్లో ఉంటుందా? ఎందుకంటే...
Director Ajay Bhupathi and Payal Rajput

తన మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100' (RX100) తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి (AjayBhupathi) రెండో సినిమా అంతగా ఆడకపోయినా, ఇప్పుడు మూడో సినిమా 'మంగళవారం' (Mangalavaaram) ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అజయ్ భూపతి మొదటి సినిమాలో కథానాయికగా ఆరంగేట్రం చేసిన పాయల్ రాజ్‌పుత్ (PayalRajput) ఇందులో కూడా ప్రధానపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయింది అని ఒక ప్రకటనలో చిత్ర నిర్వాహకులు తెలిపారు.

mangalavaaram2.jpg

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి మంగళవారం ఏమి జరుగుతుంది అనే నేపథ్యంలో ఒక హారర్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. అజయ్ ఈ సినిమా కోసం చాలా శ్రమించాడని కూడా తెలిసింది, అలాగే ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని కూడా ఈ సినిమాతో ఇస్తున్నాడు అని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఈ సినిమా 'కాంతారా' (Kantara) లెవెల్లో ఉంటుందా అని అన్నాము కదా, ఎందుకంటే ఈ సినిమాకి 'కాంతారా' పనిచేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (AjaneeshLoknath) సంగీతం అందిస్తున్నాడు.

హారర్, అతీంద్రీయ శక్తులు, మూఢనమ్మకాలు, ఈ నేపథ్యంలో సినిమా అనగానే, ఆ సినిమాకి నేపధ్య సంగీతం కూడా అంతే అవసరం. ఇప్పుడు 'కాంతారా' సినిమానే తీసుకుంటే ఆ సినిమాకి నేపధ్య సంగీతం బాగా వర్క్ అవుట్ అయింది, ముఖ్యంగా చివరి అరగంట. అందువలన ఈ 'మంగళవారం' సినిమాకి కూడా అతను సంగీతం అనగానే, ఈ సినిమా కూడా 'కాంతారా' లెవెల్లో వుండబోతోందా అని ఆసక్తిరేపుతుంది.

ఈ సినిమా పూర్తవడానికి మొత్తం 99 రోజులు పట్టిందని చెప్పారు. అలాగే సగం రోజులు రాత్రి, సగం రోజులు పగలు షూటింగ్ చేశామని కూడా చెపుతున్నారు. సినిమా గురించి దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో ఒక సహజత్వంతో కూడిన కథ అని చెప్పాడు. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి, అన్నిటికి కథలో ప్రాముఖ్యం ఉంటుంది అని చెప్పారు.

Updated Date - 2023-06-14T17:50:25+05:30 IST